Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News 4 Crore People Havent Taken Even Single Dose Of Covid Vaccine

Covid Vaccination: ‘4 కోట్ల మంది ఒక్క డోస్ కూడా తీసుకోలేదు’

Published Date :July 23, 2022 , 12:28 pm
By Mahesh Jakki
Covid Vaccination: ‘4 కోట్ల మంది ఒక్క డోస్ కూడా తీసుకోలేదు’
  • Follow Us :
  • google news
  • dailyhunt

Covid Vaccination: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ పంపిణి విస్తృత స్థాయిలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ జులై 18 నాటికి 4 కోట్ల మంది అర్హులైన లబ్ధిదారులు కొవిడ్-19 వ్యాక్సిన్‌ను ఒక్క డోస్ కూడా తీసుకోలేదని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ శుక్రవారం లోక్‌సభలో తెలిపారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, భారతదేశంలోని వయోజన జనాభాలో 98శాతం మంది కనీసం ఒక డోస్‌ని పొందారని.. జులై 18 వరకు ప్రభుత్వ కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లలో మొత్తం 1,78,38,52,566 వ్యాక్సిన్ డోసులు (97.34 శాతం) ఉచితంగా అందించినట్లు ఆమె రాతపూర్వక సమాధానం ఇచ్చారు. దేశంలో ఇప్పటివరకు ఎంతమంది కరోనా వ్యాక్సిన్‌ తీసుకోలేదో చెప్పాలని పలువురు సభ్యులు లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

దేశంలో ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లతోపాటు 60ఏళ్ల వయసుపైబడిన వారికి బూస్టర్ డోసు పంపిణీని ఈ ఏడాది మార్చిలోనే ప్రారంభించామని కేంద్రమంత్రి తెలిపారు. ఈ క్రమంలో 18 నుంచి 59ఏళ్ల వారికి జులై 15 నుంచి ఉచితంగానే పంపిణీ మొదలు పెట్టామన్నారు. ఆజాదీకా అమృత మహోత్సవ్‌లో భాగంగా దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ విస్తృత పంపిణీ కార్యక్రమాన్ని 75 రోజులపాటు కొనసాగించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, భారతదేశంలోని వయోజన జనాభాలో 98 శాతం మంది కొవిడ్-19 వ్యాక్సిన్‌లో కనీసం ఒక డోస్‌ను పొందగా.. 90 శాతం మంది పూర్తిగా రెండు డోసులను తీసుకున్నారు.

Governor Tamilisai: విమానంలో ప్రయాణికుడికి అస్వస్థత.. ప్రాథమిక చికిత్స చేసిన గవర్నర్

కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో సుమారు 10-20 శాతం మంది దీర్ఘకాలం పాటు వ్యాధి లక్షణాలు వేధిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ వివరించారు. అందులో అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్ఞాపకశక్తి, నిద్ర సమస్యలు, దగ్గు, ఛాతి నొప్పి, నరాలు నొప్పులు, వాసన, రుచి కోల్పోవడం, ఆందోళన, జ్వరం వంటి లక్షణాలు ఉంటున్నాయని తెలిపారు. ఇందుకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మార్గదర్శకాలను ఇప్పటికే విడుదల చేశామన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • central government
  • Corona Latest News
  • corona vaccination updates
  • covid precaution dose
  • Covid Vaccination

తాజావార్తలు

  • Minister Ponnam Prabhakar: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ తీపికబురు..

  • Gudivada Software Engineer Murder: హర్యానాలో ఆంధ్ర సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దారుణ హత్య..

  • Nitish Kumar: ముగిసిన నితీష్ శకం.. నేడు ఎంపీగా ప్రమాణ స్వీకారం.. నెక్ట్స్‌ సీఎం ఇతడేనా?

  • Realme C100 4G: 8000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో.. కొత్త రియల్‌మీ ఫోన్ విడుదల

  • FIFA World Cup 2026: ఫుట్‌బాల్‌ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. టికెట్లను ధరలు భారీగా పెంచిన FIFA.. సామాన్యులకు దూరమేనా..?

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions