NTV Telugu Site icon

ఎయిమ్స్‌లో క‌రోనా క‌ల్లోలం.. 384 మంది వైద్య సిబ్బందికి పాజిటివ్

AIIMS Patna

క‌రోనా సెకండ్ వేవ్ దేశ‌వ్యాప్తంగా క‌ల్లోల‌మే సృష్టిస్తోంది.. అన్ని రాష్ట్రాల్లోనూ కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి.. ఇక‌, కోవిడ్‌తో ముందుండి పోరాటం చేసే వైద్యులు, వైద్య సిబ్బంది కూడా పెద్ద సంఖ్య‌లో మ‌హ‌మ్మారి బారిన‌ప‌డుతూనే ఉన్నారు.. తాజాగా.. బీహార్‌లోని పాట్నా ఎయిమ్స్ లో ఏకంగా 384 మంది వైద్య సిబ్బందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.. బాధితుల్లో వైద్యులు, న‌ర్సులు, ఇత‌ర వైద్య సిబ్బంది కూడా ఉన్నారు. గ‌తంలో పాజిటివ్ కేసులు న‌మోదు అయినా.. ఒకే సారి ఇంత పెద్ద సంఖ్య‌లో కొత్త కేసులు వెలుగు చూడ‌డం క‌ల‌క‌లం సృష్టిస్తోంది.. దీని ప్ర‌భావం.. ఆస్ప‌త్రిలో వైద్య సేవ‌ల‌పై ప‌డింది.. ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు ఎయిమ్స్‌లో న‌మోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 700ను దాటేసింది. కాగా, బీహార్‌లో కోవిడ్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి.. రోజువారి కేసుల సంఖ్య 10 వేల‌ను దాటేసింది.