పంజాబ్ రాజధాని చంఢీఘర్‌లో గత 36 గంటలుగా అంధకారం అలుముకున్నది. చంఢీఘర్‌లో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది నిరసన దీక్షలు చేస్తున్నారు. విధులను బహిష్కరించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగించి 48 గంటల పాటు నిరసనలకు దిగడంతో చంఢీఘర్ అంధకారంగా మారిపోయింది. ఆసుపత్రులు, కార్యాలయాలు, గృహాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర వైద్యం అందక ఆసుపత్రుల్లో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు అంధకారంగా మారిపోయాయి. ఆసుపత్రుల్లో ఉన్న జనరేటర్ సౌకర్యం సరిపోకపోవడంతో అద్దెకు జనరేటర్లు తీసుకువచ్చి అత్యవసర వైద్యం అందిస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. నగరంలో జనరేటర్లకు గిరాకీ పెరిగింది. కరెంట్‌ను వీలైనంత త్వరగా పునరుద్దరించకుంటే మరిన్ని ఇబ్బందులు వస్తాయని అధికారులు పేర్కొన్నారు.