Site icon NTV Telugu

Pollution: కాలుష్య భారతం.. టాప్‌ 50 సిటీల్లో మనవే 35…!

కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో.. విధించిన లాక్‌డౌన్‌లు, ఆంక్షలతో ఎన్నడూ లేని విధంగా కాలుష్యం తగ్గిపోయినట్టు గణాంకాలు వెల్లడించాయి.. మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.. దీంతో.. దేశంలో కాలుష్య పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని సహా ఉత్తర భారతంలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంకటోంది. వరుసగా నాలుగో ఏడాది ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన రాజధానిగా ఢిల్లీ ప్రథమ స్థానంలో ఉంది. ఇక, గాలి నాణ్యత ప్రమాదకరంగా ఉన్న తొలి 50 నగరాల్లో 35 భారత్‌లోనే ఉన్నాయి. ప్రపంచ వాయు నాణ్యత నివేదిక-2021ను స్విస్‌ సంస్థ ఐక్యూఎయిర్‌ విడుదల చేసింది.

Read Also: KCR: బోయిగూడ అగ్నిప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

2021లో భారత్‌లోని ఏ నగరమూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన గాలి నాణ్యత ప్రమాణాలు లేవు. 48 శాతం నగరాల్లో డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాలు కంటే 10 రెట్లు కాలుష్యం ఉన్నట్లు వెల్లడైంది. ఢిల్లీలో గతేడాదితో పోలిస్తే కాలుష్య స్థాయిలు 15 శాతం పెరిగినట్లు నివేదిక తెలిపింది. ప్రపంచంలోనే తొలి వంద కాలుష్య నగరాల్లో 63 మన దేశంలోనే ఉన్నాయి. అత్యంత కాలుష్య రాజధానుల జాబితాలో ఢిల్లీ తొలి స్థానంలో ఉండగా.. బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా రెండో స్థానంలో ఉంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో రాజస్థాన్‌ భీవాడి ప్రథమ స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానంలో ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌, ఢిల్లీ నాలుగో స్థానంలో ఉన్నాయి. ఈ జాబితాలో తొలి 15 నగరాల్లో 10 భారత్‌లోనే ఉన్నాయి. చైనాలోని హోటన్‌ నగరం…ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది. పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్‌, బహవల్‌పూర్‌, పెషావర్‌, లాహోర్‌ కాలుష్య నగరాల జాబితాలో ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.

Exit mobile version