NTV Telugu Site icon

Drugs Burnt: ఒకేసారి 30 వేల కిలోల డ్రగ్స్‌ను తగలెట్టేశారు.. అంతా అమిత్ షా సమక్షంలోనే..

Drug Destroyed

Drug Destroyed

Drugs Burnt: కేంద్ర హోం మంత్రి అమిత్ షా వర్చువల్ సమక్షంలో శనివారం భారతదేశంలోని నాలుగు ప్రాంతాల్లో 30,000 కిలోల డ్రగ్స్‌ని కాల్చివేశారు. ఢిల్లీ, చెన్నై, గౌహతి, కోల్‌కతాలో పట్టుబడిన డ్రగ్స్‌ను చండీగఢ్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యవేక్షణలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కాల్చివేసింది. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ను జరుపుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు సుమారు 75,000 కిలోల డ్రగ్స్‌ను ధ్వంసం చేస్తామని ప్రతిజ్ఞ చేసినట్లు హోంమంత్రి తెలిపారు. ఈ రోజు వరకు తాము ఇప్పటికే 82,000 కిలోల మాదక ద్రవ్యాలను కాల్చివేసామని.. ఆగస్టు 15 నాటికి లక్ష కిలోల మార్కుకు చేరుకుంటామని ఆయన వెల్లడించారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) జూన్ 1 నుండి డ్రగ్స్ నిర్మూలన ప్రచారాన్ని ప్రారంభించింది. జులై 29 వరకు 11 రాష్ట్రాల్లో 51,217 కిలోల మాదకద్రవ్యాలను నిర్మూలించిందని ఒక అధికారి తెలిపారు.

Uddav Thackeray: మహారాష్ట్ర గవర్నర్ మరాఠీలను అవమానించారు.. రాజీనామాకు డిమాండ్!

30,468 కిలోలకు పైగా డ్రగ్స్‌ను కాల్చివేసిన తర్వాత, ఈ మొత్తం పరిమాణం 81,686 కిలోలకు చేరుకుంది. ఇది మాదకద్రవ్యాల రహిత భారతదేశం కోసం పోరాటంలో పెద్ద విజయంగా ఎన్సీబీ తన లక్ష్యాన్ని అధిగమించిందని అధికారి తెలిపారు. శనివారం ఢిల్లీలో 19,320 కిలోలు, చెన్నైలో 1,309 కిలోలు, గౌహతిలో 6,761 కిలోలు, కోల్‌కతాలో 3,077 కిలోల డ్రగ్స్ ధ్వంసమయ్యాయి. చండీగఢ్‌లో జరిగిన సదస్సులో అమిత్ షా మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల పట్ల కేంద్ర ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంభించి దాని ఫలితాలను చూపుతోందని అన్నారు. ఆరోగ్యవంతమైన సమాజం, సుసంపన్నమైన దేశం లక్ష్యాన్ని సాధించేందుకు ఇది అవసరమని ఆయన అన్నారు. మాదకద్రవ్యాల వ్యాపారం ద్వారా వచ్చే “మురికి డబ్బు” దేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలకు ఉపయోగించబడుతుంది కాబట్టి భద్రతా దృక్కోణం నుండి కూడా ఇది ముఖ్యమైనదని అమిత్ షా అన్నారు. 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక కేంద్ర ప్రభుత్వం డ్రగ్స్ పట్ల జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరించిందని షా అన్నారు. ఈ సదస్సును ఎన్‌సీబీ నిర్వహించింది.

Show comments