Site icon NTV Telugu

Weather Update: జూన్‌లో 30 శాతం తగ్గిన వర్షపాతం

Weather

Weather

Weather Update: దేశంలో నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా వచ్చాయి. రుతు పవనాలు ఆలస్యంగా రావడంతో ఈ ఏడాది జూన్‌లో వానలు కురవలేదు. దీంతో గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది జూన్‌లో 30 శాతం తగ్గిన వర్షపాతం తగ్గినట్టు నివేదికలు తెలియజేస్తున్నాయి. నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమవడంతో వానలు కురవాల్సినంతగా కురవలేదు. ఈ ఏడాది జూన్‌లో సాధారణం కంటే 30 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే జూన్‌ 24 నాటికి 4 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. దీని వల్ల రిజర్వాయర్లలో నీటిమట్టాలు అడుగంటుతున్నాయని.. మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ నివేదిక ప్రకటించింది.

Read also: Sri Ganesha Stotra Parayanam: నేడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే విఘ్నాలు తొలిగి శుభాలు చేకూరుతాయి

జూన్‌ 22 నాటికి దక్షిణాదిలోని రిజర్వాయర్లలో నీటిమట్టం 26 శాతానికి చేరుకున్నాయని నివేదికలో పేర్కొంది. ఇది గడిచిన నాలుగేండ్లలో కనిష్ఠమని తెలిపింది. బిపర్జాయ్‌ తుఫాను కారణంగా రుతుపవనాల రాక ఆలస్యమైందని నివేదిక పేర్కొంది. దీని కారణంగా వాయవ్యం మినహా దేశమంతటా సాధారణం కంటే తక్కువ వర్షపాతాలు నమోదవుతున్నాయని తెలిపింది. దక్షిణాదిలో సాధారణం కంటే 51 శాతం తక్కువగా వర్షపాతం నమోదవ్వగా.. మధ్య భారత్‌లో 51 శాతం, పశ్చిమ, ఈశాన్య రీజియన్లలో 19 శాతం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైనట్టు నివేదికలో వెల్లడించింది. ఈ ఏడాదిలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ ఏడాది మొత్తం పడాల్సిన వర్షపాతంలో జూన్‌లో అతితక్కువగా 19 శాతం వర్షపాతం నమోదవ్వనుండగా.. జులైలో మూడింట ఒక వంతు, ఆగస్టులో 29 శాతం వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ తెలిపింది.

Read also: Salman Khan : సల్మాన్ ను చంపేస్తాం.. బహిరంగ హెచ్చరిక

వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటివరకు 4.5 శాతం పంటలే సాగయ్యాయి. గతేడాదితో పోలిస్తే వరి (-36), పత్తి (-14.2), జనపనార (-12.2) శాతం మేర సాగు తగ్గింది. తెలంగాణలో సాధారణం కంటే 64 శాతం వర్షపాతం నమోదయింది. ఇక పశ్చిమబెంగాల్‌లో 28 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 52 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 38 శాతం, ఒడిశాలో 54 శాతం, చత్తీస్‌గఢ్‌లో 70 శాతం, హర్యానాలో 31 శాతం, మధ్యప్రదేశ్‌లో 53 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది.

Exit mobile version