NTV Telugu Site icon

Jammu Kashmir: ఆర్మీ వాహనంపై దాడి.. కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం..

Jammu Kashmir

Jammu Kashmir

Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ వరస ఉగ్రదాడులతో ఉద్రిక్తంగా ఉంది. వలస కూలీలు, ఆర్మీ జవాన్లు టార్గెట్‌గా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతున్నారు. సోమవారం అఖ్నూర్ సెక్టార్‌లో ఆర్మీ వాహనంపై కాల్పులు జరిగాయి. జవాన్లు తిరిగి ఉగ్రవాదులపై కాల్పులు జరపడంతో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. భద్రతా దళాలు ఆ ప్రాంతం నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకుంది. ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది.

Read Also: Food Poison: మోమోస్ తిని ఫుడ్ పాయిజన్.. ఒకరు మృతి, 20 మందికి పైగా అస్వస్థత

బటాల్ ప్రాంతంలో ఉదయం 7 గంటల సమయంలో ముగ్గురు ఉగ్రవాదులు ఆర్మీ వాహనంపై పలు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ దాడి జరిగిన వెంటనే భద్రతా బలగాలు ఆ స్రాంతాన్ని చుట్టుముట్టి, సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. దీపావళి పండగ సందర్భంగా జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా భద్రతా బలగాలు, ముఖ్యంగా జమ్మూ ప్రాంతంలో విస్తృతమైన భద్రత ఏర్పాటు చేస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. మరోవైపు కాశ్మీర్ లోయలో గత వారం నుంచి ఉగ్రవాదుల దాడుల్లో ఇద్దరు సైనికులతో సహా 12 మంది మరణించారు.

అక్టోబర్ 24న, బారాముల్లాలోని గుల్‌మార్గ్ సమీపంలో ఉగ్రవాదులు ఆర్మీ వాహనంపై మెరుపుదాడి, ఇద్దరు సైనికులు మరియు ఇద్దరు పోర్టర్‌లను చంపారు, అదే రోజు ప్రారంభంలో, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక యువకుడు త్రాల్‌లో జరిగిన దాడిలో గాయపడ్డాడు, ఇది ఒక వారంలో కశ్మీర్‌లోని వలస కార్మికులపై మూడవ దాడిని సూచిస్తుంది. అక్టోబరు 20న గందర్‌బాల్ జిల్లా సోనామార్గ్‌లోని నిర్మాణ స్థలంలో ఉగ్రవాదులు ఒక వైద్యుడు, ఆరుగురు వలస కార్మికులతో సహా ఏడుగురిని హతమార్చారు. ఈ ఘటనకు రెండు రోజుల ముందు బీహార్‌కు చెందిన మరో వలస కార్మికుడిపై దాడి జరిగింది.