3 LeT terrorists killed in Shopian encounter: మంగళవారం ఉదయం జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లా ముంజ్ మార్గ్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో.. ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ముగ్గురిలో ఇద్దరు లోకల్ ఉగ్రవాదులుగా అధికారులు తేల్చారు. ఆ ఇద్దరిని లతీఫ్ లోనె (షోపియాన్), ఉమర్ నజీర్ (అనంతనాగ్)గా గుర్తించారు. కశ్మీరీ పండిట్ పురానా కృష్ణ భట్ హత్య కేసులో లతీఫ్ నిందితుడు కాగా.. నేపాల్‌కు చెందిన తిల్ బహదూర్ థాపా హత్య కేసులో ఉమర్ నజీర్ ప్రమేయం ఉంది. ఈ నిందితుల నుంచి ఒక ఏకే 47 తుపాకీతో పాటు రెండు పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు, భద్రతా దళాలు ఉమ్మడిగా వ్యతిరేక ఉగ్రవాద ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో తారసపడిన ఉగ్రవాదులు కాల్పులకు జరిపారు. దీంతో.. భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరపడంతో, ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఇతర ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Harish Rao: సడెన్ ట్విస్ట్ ఇచ్చిన హరీశ్ రావు.. రైల్వే శాఖపై అసహనం
కాగా.. భద్రతా బలగాలు జరుపుతున్న ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో ఉగ్రవాదుల్ని చీడపురుగుల్లా ఏరి, వారి భరతం పడుతున్నారు. గత నెలలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భాగంగా.. అవంతిపోరాలో ముగ్గురు, బిజ్‌బెహరా ప్రాంతంలో ఒక ఉగ్రవాది హతయ్యారు. అవంతిపోరాలో హతమైన ముగ్గురు ఉగ్రవాదుల్లో ఒకరు ఆ ప్రాంతంలో భద్రతా బలగాలపై దాడుల చేయడంతో పాటు పలు సంఘటనల్లో పాల్గొన్నాడు. అంతకుముందు, అక్టోబర్ 26న జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ప్రారంభమైన యాంటీ టెర్రర్ ఆపరేషన్‌లో ఒక ఆర్మీ జవాన్ మరణించగా, లష్కరే తోయిబాకు చెందిన స్థానిక ఉగ్రవాదిని అరెస్టు చేశారు.
Man Killed Over Land Issue: ప్రాణం తీసిన భూ వివాదం.. మార్నింగ్ వాక్ చేస్తుండగా..