Site icon NTV Telugu

Jharkhand: నోట్ల కట్టలతో పట్టుబడిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. పార్టీ నుంచి సస్పెండ్

Congress Mlas Arrested

Congress Mlas Arrested

Jharkhand: జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల కారులో నోట్ల కట్టలు బయటపడిన విషయం తెలిసిందే. భారీ నగదుతో పోలీసులకు పట్టుబడిన ఆ ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై వేటు పడింది. ఆ ముగ్గురిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఇర్ఫాన్‌ అన్సారీ, రాజేశ్‌ కచ్చప్, నమన్‌ బిక్సల్‌ కొంగరిలను శనివారం రాత్రి బెంగాల్‌లోని హౌరా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.

అయితే, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పోలీసులకు పట్టుబడడం జేఎంఎం-కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వ అవినీతికి నిదర్శనమని బీజేపీ ఆరోపించింది. ఇదిలా ఉండగా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందిన కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. ఆపరేషన్‌ కమల్లో భాగంగానే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు భారీ మొత్తంలో డబ్బు ఆఫర్‌ చేశారని అంటున్నారు. దీంతో, కాంగ్రెస్‌ నేతల వ్యవహారం పొలిటికల్‌గా హీట్‌ పుట్టిస్తోంది.

Ring Nets Issue: కొనసాగుతున్న రింగు వలల వివాదం..

ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను తక్షణమే సస్పెండ్‌ చేస్తున్నట్లు సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారని.. . వీరి సస్పెన్షన్‌ వెంటనే అమల్లోకి వస్తుందని ఝార్ఖండ్‌ పార్టీ ఇన్‌ఛార్జ్‌ అవినాశ్‌ పాండే వెల్లడించారు. ఇందుకు సంబంధించి పార్టీలో ప్రతిఒక్కరి సమాచారం తమ దగ్గర ఉందన్న ఆయన.. ఇందులో ఎవరి ప్రమేయం ఉన్నట్లు తేలినా చర్యలు తీసుకుంటామన్నారు. ఇదిలాఉంటే, ఎమ్మెల్యేల వద్ద పట్టుబడ్డ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో కాంగ్రెస్‌ వివరణ ఇవ్వాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. ఈ నేపథ్యంలో ఝార్ఖండ్‌లో అవినీతిపై దర్యాప్తు జరపాలని బెంగాల్‌ భాజపా సీనియర్‌ నేత దిలీప్‌ ఘోష్‌ డిమాండ్‌ చేశారు. మరోవైపు ఝార్ఖండ్‌ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బేరసారాలు జరుగుతున్నాయన్న వార్తల నేపథ్యంలోనే ఈ నగదు లభ్యమైందని తృణమూల్‌ కాంగ్రెస్‌ పేర్కొంది.

Exit mobile version