NTV Telugu Site icon

Fake Jobs: విదేశాల్లో విద్య, ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.3 కోట్లు టోకరా..

Fake Jobs

Fake Jobs

విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.3 కోట్లు వసూలు చేశారు దంపతుల జంట. ఈ ఘటన మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ జిల్లా ఉరాన్‌లో చోటు చేసుకుంది. ఓ సంస్థను కలిగి ఉన్న దంపతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. విదేశాల్లో చదువు, ఉద్యోగం ఇప్పిస్తానని ఓ డాక్టర్‌తో పాటు అతని కుటుంబసభ్యులను రూ.3 కోట్లకు పైగా మోసం చేశారన్న ఆరోపణలు వీరిపై ఉన్నాయి.

Read Also: US firing: నైట్‌క్లబ్ దగ్గర కాల్పులు.. ముగ్గురు మృతి

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఎన్‌ఆర్‌ఐ సాగరి పోలీస్ స్టేషన్ అధికారి ఈ అంశపై మాట్లాడుతూ.. ‘లివి ఓవర్‌సీస్ స్టడీ ప్రైవేట్ లిమిటెడ్’ అనే సంస్థ విదేశీ విద్యా రంగంలో సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే.. ఈ విషయంపై మోసపోయామని తెలుసుకున్న నవీ ముంబైలోని సీవుడ్‌లో నివసిస్తున్న బాధితుడు.. సంస్థ యజమాని జుగ్ను చింతామన్ కోలీ, అతని భార్య తేజస్విపై ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Read Also: Alleti Maheshwar Reddy : సీఎం అసెంబ్లీలో మాట్లాడాలంటే ఎందుకు జంకుతున్నారు

బాధితుడు డాక్టర్ తన ఇద్దరు పిల్లలకు జర్మనీ, ఆస్ట్రేలియా యూనివర్సిటీల్లో విద్య కోసం అడ్మిషన్ ఇప్పిస్తానని.. అంతేకాకుండా.. తనకు, అతని భార్యకు విదేశాల్లో వైద్యరంగంలో మంచి ఉద్యోగం ఇప్పిస్తానని దంపతులు హామీ ఇచ్చారన్నారు. అయితే.. 2022 డిసెంబర్ నుండి ఇప్పటి వరకు ఉద్యోగం, విద్య ఇప్పిస్తానని ఇవ్వకపోగా. వీరి వద్ద నుంచి మొత్తం రూ. 3,02,83,621 చెక్కుల ద్వారా.. రూ.27 లక్షల నగదు రాబట్టారు. చివరికి మోసపోయామని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.