Site icon NTV Telugu

Tamil Nadu: గొంతులో చేప చిక్కుకుని జాలరి మృతి

Tamilnadu

Tamilnadu

తమిళనాడుకు చెందిన ఒక జాలరి గొంతులో బతికి ఉన్న చేప అడ్డుపడి ప్రాణాలు కోల్పోయాడు. చెంగల్పట్టులోని మధురాంతకం సమీపంలో ఈ ఘటన జరిగింది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

చెంగల్పట్టుకు చెందిన 29 ఏళ్ల మణిగండన్ అనే యువకుడు స్థానిక సరస్సులో చేతులతో చేపలు పడుతున్నాడు. అయితే ఒక చేపను నోటిలో పెట్టుకుని.. ఇంకో చేపను పడుతున్నాడు. ఇంతలో నోటిలో ఉన్న చేప హఠాత్తుగా గొంతులోకి వెళ్లిపోయింది. గొంతు లోపలికి దూరి పోవడంతో ఊపిరాడక అక్కడికక్కడే చనిపోయాడు. సహచరులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం దక్కలేదు. చనిపోయినట్లుగా వైద్యులు ప్రకటించారు.

ఇది కూడా చదవండి: Vizag Mayor: మేయర్‌పై అవిశ్వాస తీర్మానంలో కొత్త ట్విస్ట్‌..! దేశం దాటిన కార్పొరేటర్లు..

మృతుడు అరయపక్కం గ్రామానికి చెందిన మణిగండన్‌గా గుర్తించారు. స్థానికంగా రోజువారీ కూలీగా పనిచేస్తుంటాడు. ఇతడికి చేతులతో చేపలు పట్టే అలవాటు ఉంది. నీటి మట్టాలు తక్కువగా ఉన్న కీళవలం సరస్సుకు వెళ్లి చేపలు పడుతుంటాడు. అయితే మంగళవారం సాయంత్రం ‘పనంగోట్టై’ అని పిలువబడే బతికి ఉన్న చేపను నోటితో కరిచిపెట్టాడు. ఈ చేప పదునైన రెక్కలు కలిగి ఉంటుంది. అయితే మరొక చేప కోసం.. ప్రయత్నిస్తుండగా పనంగోట్టై చేప గొంతులోకి దూరిపోవడంతో మణిగండన్ చనిపోయినట్లుగా స్థానికులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Union Cabinet: ఏపీకి గుడ్‌న్యూస్‌ చెప్పిన కేంద్రం.. రూ.1,332 కోట్లతో..

Exit mobile version