Intimate Relationship: త్యాగమూర్తివయ్యా.. భార్యకు లవర్‌తో పెళ్లి జరిపించిన భర్త..

  • ప్రియుడితో భార్య ఎఫైర్..
  • ఇది తెలిసి సంచలన నిర్ణయం తీసుకున్న భర్త..
Intimate Relationship

Intimate Relationship

Intimate Relationship: త్యాగానికి మారుపేరుగా నిలిచాడు బీహార్‌కి చెందిన ఓ వ్యక్తి. బీహార్ రామ్‌నగర్ గ్రామానికి చెందిన 26 ఏళ్ల రాజేష్ కుమార్ తన భార్యని ఆమె ప్రేమించిన యువకుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఇటీవల ఓ వ్యక్తి రాజేష్ కుమార్ ఇంట్లోకి దూరిన సమయంలో అతని తల్లిదండ్రులు పట్టుకున్నారు. దీంతో భార్య ఖుష్బూ(22)కి అతడితో ఉన్న సంబంధం వెలుగులోకి వచ్చింది. ఖష్బూ ప్రియుడు చందన్(24)గా తెలిసింది. చందన్, ఖుష్బూని కలవడానికి రాత్రి సమయంలో దొంగచాటుగా రావడంతో ఈ వ్యవహారం బట్టబయలైంది.

Read Also: Anam Ramanarayana Reddy: టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని జలాశయాలు నిండి పోయాయి..

దీంతో రాజేష్ కుమార్, చందన్-కుష్బూలకు పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. చందన్ కూడా ఖుష్బూతో పాటు ఆమె రెండేళ్ల కుమారుడిని తన కొడుకుగా అంగీకరించాడు. వీరిద్దరి పెళ్లికి ఏర్పాట్లను రాజేష్ కుమారే దగ్గరండి చేశాడు. గ్రామస్థుల సమక్షంలో పెళ్లి చేయించారు. దీనిపై ఖష్బూ మీడియాతో మాట్లాడుతూ.. తాను సంతోషంగా ఉన్నానని, తన మాజీ భర్తకు కృతజ్ఞతలు చెప్పింది. ఈ పెళ్లికి రాజేష్ తల్లిదండ్రులు కూడా మద్దతు తెలిపారు. అయితే, తమ మనవడిని మాత్రం తమతో ఉండనివ్వాలని, అతనే తమ ఆనందానికి మూలం అని చెప్పారు. రాజేష్ తన భార్య అక్రమసంబంధం గురించి తెలిసి, పెళ్లి జరిపించడాన్ని గ్రామస్తులు కొనియాడారు.