26/11 Mumbai Attacks: ముంబై ఉగ్రదాడుల వెనుక మరో రహస్యం.. 18 ఏళ్లుగా వీడని పాక్ ఆర్మీ అధికారి మిస్టరీ!
- 18 ఏళ్లు గడుస్తున్నా ముంబై దాడుల్లో మిస్టరీగానే కొన్ని విషయాలు..
- ఉగ్రవాది అజ్మల్ కసబ్ చెప్పిన ‘‘మేజర్ జనరల్ సాహబ్’’ గుర్తింపు ఇంకా రహస్యమే..
- ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చింది ఇతడే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
26/11 Mumbai Attacks: 2008 నవంబర్ 26 ముంబై ఉగ్రదాడులకు 18 ఏళ్లు పూర్తయ్యాయి. భారత చరిత్రలోనే అత్యంత దారుణమైన ఉగ్రదాడిగా ముంబై దాడులు మిగిలిపోయాయి. భారత్‌పై యుద్ధానికి వచ్చారా? అనేలా ఈ దాడులు జరిగాయి. పాకిస్తాన్ ప్రేరేపిత ముష్కరులు కరాచీ నుంచి అరేబియా సముద్రం మీదుగా ముంబైకి వచ్చారు. ఈ దాడుల్లో 170 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 26 మంది విదేశీయులు ఉన్నారు. సుమారు 60 గంటల పాటు ఈ దాడులు జరిగాయి.
మిస్టరీగా మేజర్ జనరల్ సాహెబ్..
అయితే, ఈ దాడులకు సంబంధించిన పాకిస్తాన్‌కు చెందిన కొందరి వ్యక్తుల ప్రమేయం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ముఖ్యంగా ఉగ్రవాది అజ్మల్ కసబ్ వెల్లడించిన ఓ సీనియర్ పాకిస్తానీ సైనిక అధికారి గుర్తింపు మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలించింది. కసబ్ తన విచారణలో అతడిని కేవలం ‘‘మేజర్ జనరల్ సాహబ్’’ అని మాత్రమే ప్రస్తావించాడు. దాడులు జరుగుతున్నప్పుడు, దాడి చేసినవారికి మరియు వారి హ్యాండ్లర్లకు మధ్య జరిగిన సంభాషణలలో మేజర్ జనరల్ సాహెబ్ ప్రస్తావన ఉంది.
Also Read
- Space X Shares: ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన.. పిల్లలకూ స్పేస్ ఎక్స్ షేర్లు ఇస్తాం..
- Nvidia: ఎన్విడియాలో మరో సంచలన ప్రేమకథ.. చైనా లింక్ ఉన్న సంస్థ ఎగ్జిక్యూటివ్‌తో సీఈఓ సన్నిహితుడి రహస్య వివాహం..?
- Netflix Pakistani content India: పాకిస్థానీ వెబ్ సిరీస్ వివాదం.. Netflixకు కేంద్రం కీలక సూచన!
- Saurav Das LOC Case: లుకౌట్ సర్క్యులర్‌తో సౌరవ్ దాస్‌కు అడ్డంకి.. ఢిల్లీ హైకోర్టుకు కేంద్రం కీలక సమాచారం
28/11 దాడుల కేసులో 2009లో దాఖలైన ఛార్జిషీట్లో పాకిస్తాన్‌కు చెందిన 32 మంది పేర్లను ప్రస్తావించారు. ఇందులో నెంబర్ 20గా మేజర్ జనరల్ సాహబ్ ఉన్నారు. ఈ జాబితాలో ఇప్పటికీ నిర్ధారణ కానీ వ్యక్తి ఇతనొక్కడే. విచారణలో కసబ్ తనకు శిక్షణ ఇచ్చిన లష్కరే తోయిబా, పాకిస్తాన్ సైన్యం గురించి కీలక విషయాలు వెల్లడించారు. ముజఫరాబాద్‌లోని లష్కరే తోయిబా శిక్షణ కేంద్రంలో తనకు మేజర్ జనరల్ శిక్షణ ఇచ్చేవాడని వెల్లడించాడు. ఆ సమయంలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హఫీజ్ సయీద్, జకీ-ఉర్-రెహ్మన్ లఖ్వీ కూడా మేజర్ జనరల్‌తో సన్నిహితంగా ఉండేవారని చెప్పారు. 8 వారాల పాటు తమకు శిక్షణ ఇచ్చారని, జిహాదీలుగా తీర్చిదిద్దినట్లు కసబ్ విచారణలో వెల్లడించాడు.
ఛార్జిషీట్లో పాక్ అధికారులు..
ఎన్ఐఏ ఛార్జిషీట్లో కసబ్‌తో పాటు డేవిడ్ హెడ్లీ ఇచ్చిన వివరాల ఆధారంగా పాకిస్తాన్ సైన్యానికి చెందిన పలువురు అధికారుల పేర్లను ప్రస్తావించారు. వీరిలో జనరల్ జనరల్ మహమ్మద్ ఖాలిద్ రావు, స్పెషల్ కమ్యూనికేషన్స్ ఆర్గనైజేషన్ (SCO)కు చెందిన కల్నల్ సదాతుల్లా, మేజర్ ఇక్బాల్, ఆయన పైఅధికారి లెఫ్టినెంట్ కల్నల్ హమ్జా ఉన్నారు. అయితే ‘మేజర్ జనరల్ సాహబ్’ అసలు పేరు, గుర్తింపు మాత్రం ఇప్పటికీ బయటపడలేదు.
తాజావార్తలు
-
Space X Shares: ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన.. పిల్లలకూ స్పేస్ ఎక్స్ షేర్లు ఇస్తాం..
-
26/11 Mumbai Attacks: ముంబై ఉగ్రదాడుల వెనుక మరో రహస్యం.. 18 ఏళ్లుగా వీడని పాక్ ఆర్మీ అధికారి మిస్టరీ!
-
Tollywood Box Office: పాటలతో పూనకాలు.. కథతో నీరసాలు! టాలీవుడ్లో ఇదేం వింత?
-
Nvidia: ఎన్విడియాలో మరో సంచలన ప్రేమకథ.. చైనా లింక్ ఉన్న సంస్థ ఎగ్జిక్యూటివ్‌తో సీఈఓ సన్నిహితుడి రహస్య వివాహం..?
-
National Stock Exchange: భారత్‌కు మరో ఘనత.. ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్గా రికార్డు..
ట్రెండింగ్
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్‌కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
-
Apple Kukatpally: హైదరాబాద్‌లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!