26/11 Mumbai Attacks: ముంబై ఉగ్రదాడుల వెనుక మరో రహస్యం.. 18 ఏళ్లుగా వీడని పాక్ ఆర్మీ అధికారి మిస్టరీ!

  • 18 ఏళ్లు గడుస్తున్నా ముంబై దాడుల్లో మిస్టరీగానే కొన్ని విషయాలు..
  • ఉగ్రవాది అజ్మల్ కసబ్ చెప్పిన ‘‘మేజర్ జనరల్ సాహబ్’’ గుర్తింపు ఇంకా రహస్యమే..
  • ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చింది ఇతడే..
26 11 Attack

26 11 Attack

26/11 Mumbai Attacks: 2008 నవంబర్ 26 ముంబై ఉగ్రదాడులకు 18 ఏళ్లు పూర్తయ్యాయి. భారత చరిత్రలోనే అత్యంత దారుణమైన ఉగ్రదాడిగా ముంబై దాడులు మిగిలిపోయాయి. భారత్‌పై యుద్ధానికి వచ్చారా? అనేలా ఈ దాడులు జరిగాయి. పాకిస్తాన్ ప్రేరేపిత ముష్కరులు కరాచీ నుంచి అరేబియా సముద్రం మీదుగా ముంబైకి వచ్చారు. ఈ దాడుల్లో 170 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 26 మంది విదేశీయులు ఉన్నారు. సుమారు 60 గంటల పాటు ఈ దాడులు జరిగాయి.

మిస్టరీగా మేజర్ జనరల్ సాహెబ్..

అయితే, ఈ దాడులకు సంబంధించిన పాకిస్తాన్‌కు చెందిన కొందరి వ్యక్తుల ప్రమేయం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ముఖ్యంగా ఉగ్రవాది అజ్మల్ కసబ్ వెల్లడించిన ఓ సీనియర్ పాకిస్తానీ సైనిక అధికారి గుర్తింపు మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలించింది. కసబ్ తన విచారణలో అతడిని కేవలం ‘‘మేజర్ జనరల్ సాహబ్’’ అని మాత్రమే ప్రస్తావించాడు. దాడులు జరుగుతున్నప్పుడు, దాడి చేసినవారికి మరియు వారి హ్యాండ్లర్లకు మధ్య జరిగిన సంభాషణలలో మేజర్ జనరల్ సాహెబ్ ప్రస్తావన ఉంది.

28/11 దాడుల కేసులో 2009లో దాఖలైన ఛార్జిషీట్‌లో పాకిస్తాన్‌కు చెందిన 32 మంది పేర్లను ప్రస్తావించారు. ఇందులో నెంబర్ 20గా మేజర్ జనరల్ సాహబ్ ఉన్నారు. ఈ జాబితాలో ఇప్పటికీ నిర్ధారణ కానీ వ్యక్తి ఇతనొక్కడే. విచారణలో కసబ్ తనకు శిక్షణ ఇచ్చిన లష్కరే తోయిబా, పాకిస్తాన్ సైన్యం గురించి కీలక విషయాలు వెల్లడించారు. ముజఫరాబాద్‌లోని లష్కరే తోయిబా శిక్షణ కేంద్రంలో తనకు మేజర్ జనరల్ శిక్షణ ఇచ్చేవాడని వెల్లడించాడు. ఆ సమయంలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హఫీజ్ సయీద్, జకీ-ఉర్-రెహ్మన్ లఖ్వీ కూడా మేజర్ జనరల్‌తో సన్నిహితంగా ఉండేవారని చెప్పారు. 8 వారాల పాటు తమకు శిక్షణ ఇచ్చారని, జిహాదీలుగా తీర్చిదిద్దినట్లు కసబ్ విచారణలో వెల్లడించాడు.

 

ఛార్జిషీట్లో పాక్ అధికారులు..

ఎన్ఐఏ ఛార్జిషీట్‌లో కసబ్‌తో పాటు డేవిడ్ హెడ్లీ ఇచ్చిన వివరాల ఆధారంగా పాకిస్తాన్ సైన్యానికి చెందిన పలువురు అధికారుల పేర్లను ప్రస్తావించారు. వీరిలో జనరల్ జనరల్ మహమ్మద్ ఖాలిద్ రావు, స్పెషల్ కమ్యూనికేషన్స్ ఆర్గనైజేషన్ (SCO)కు చెందిన కల్నల్ సదాతుల్లా, మేజర్ ఇక్బాల్, ఆయన పైఅధికారి లెఫ్టినెంట్ కల్నల్ హమ్జా ఉన్నారు. అయితే ‘మేజర్ జనరల్ సాహబ్’ అసలు పేరు, గుర్తింపు మాత్రం ఇప్పటికీ బయటపడలేదు.