NTV Telugu Site icon

క‌రోనా సెకండ్ వేవ్: ఆందోళన కలిగిస్తున్న డాక్టర్ల మృతుల సంఖ్య

దేశంలో కరోనా వ్యాప్తి ఎక్కువవుతోంది. సెకండ్ వేవ్ తో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మృతుల సంఖ్య కూడా ఎక్కువగానే వుంది. కాగా ఫ్రంట్ వారియర్స్ గా పోరాడుతున్న డాక్టర్లు కూడా మృత్యువాత పడటం కలిచివేస్తుంది. క‌రోనా మొద‌టి వేవ్‌లో 730 మంది డాక్ట‌ర్లు మృతి చెంద‌గా, సెకండ్ వేవ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 244 మంది వైద్యులు మృతి చెందిన‌ట్లు ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ వెల్ల‌డించింది. ఇక రాష్ట్రాలవారీగా చూస్తే సెకండ్ వేవ్‌లో 69 మంది డాక్ట‌ర్ల మరణాలతో బీహార్‌ మొదటి స్థానంలో వుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో 21, తెలంగాణలో 19 మంది డాక్టర్లు మరణించటం ఆందోళన కలిగిస్తోంది.