NTV Telugu Site icon

Canada: కెనడాలో 24 ఏళ్ల భారతీయ విద్యార్థిని దారుణహత్య..

Chirag

Chirag

Canada: కెనడాలో భారతీయ విద్యార్థి దారుణహత్యకు గురయ్యాడు. సౌత్ వాంకోవర్‌లో 24 ఏళ్ల విద్యార్థి తన కారులో కాల్చి చంపినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. మరణించిన వ్యక్తిని చిరాగ్ ఆంటిల్‌గా గుర్తించారు. తుపాకీ శబ్ధాలు విన్న పొరుగువారు పోలీసులకు సమాచారం అందించిన తర్వాత వాహనంలో శవమై కనిపించాడు. ఏప్రిల్ 12 రాత్రి 11 గంటలకు ఆ ప్రాంతంలోని నివాసితులు తుపాకీ కాల్పులు విన్న తర్వాత, పోలీసులకు సమాచారం రావడంతో వారు ఈస్ట్ 55 అవెన్యూ, మెయిన్ స్ట్రీట్‌కి వచ్చారు. ఆడి కారులో మరణించిన చిరాగ్ ఆంటిల్ మృతదేహాన్ని గుర్తించారు. ఈ హత్యలో ఇప్పటివరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు. దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.

Read Also: Benjamin Netanyahu: “ఎవరు మాకు హాని చేయాలని చూశారో.. వారికి మేం హాని చేస్తాం”.. ఇరాన్‌కి హెచ్చరిక..

చిరాగ్ అంటిల్ సోదరుడు రోనిత్ విలేకరులతో మాట్లాడుతూ చిరాగ్ ఉదయం ఫోన్‌లో మాట్లాడినప్పుడు సంతోషంగానే ఉన్నాడని, ఎక్కడికో వెళ్లేందుకు తన ఆడి కారును బయటకు తీశాడని, అప్పుడే కాల్చి చంపబడ్డాడని చెప్పారు. కాంగ్రెస్ స్టూడెంట్స్ వింగ్ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా చీఫ్ వరుణ్ చౌదరి ఎక్స్ వేదికగా విద్యార్థి మృతదేహాన్ని భారత్ తీసుకువచ్చేందుకు సాయం చేయాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను కోరారు. అతని హత్యకు న్యాయం జరిగేలా చూడాలని అన్నారు.

చిరాగ్ మృతదేహాన్ని భారత్ తీసుకువచ్చేందుకు క్రౌడ్ ఫండింగ్ ఫ్లాట్‌ఫారమ్ గోఫండ్‌మీ ద్వారా డబ్బు సేకరిస్తున్నట్లు అక్కడి స్థానిక మీడియా నివేదించింది. చిరాగ్ స్వరాష్ట్రం హర్యానా. అతనికి ఎవరితో కూడా సమస్యలు, గొడవలు లేవని, చాలా మంచి వ్యక్తి అని మృతుడి సోదరుడు రోమిత్ చెప్పారు. చిరాగ్ సెప్టెంబర్ 2022లో వాంకోవర్ వచ్చాడు, అక్కడే యూనివర్సిటీ కెనడా వెస్ట్ నుంచి ఎంబీఏ పూర్తి చేసి, ఇటివలే వర్క్ పర్మిట్ పొందాడు.