Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News 24 Patients Including 12 Newborns Die In Maharashtra Hospital In A Day

Maharashtra: నాందేడ్ ఆస్పత్రిలో ఘోరం.. ఒక్కరోజులో 12 మంది శిశువులు, మొత్తంగా 24 మంది మృతి

Published Date :October 2, 2023 , 9:29 pm
By Venu Goapl Reddy
Maharashtra: నాందేడ్ ఆస్పత్రిలో ఘోరం.. ఒక్కరోజులో 12 మంది శిశువులు, మొత్తంగా 24 మంది మృతి
  • Follow Us :
  • google news
  • dailyhunt

Maharashtra: మహారాష్ట్రలో ఘోరం జరిగింది. నాందేడ్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలో 24 గంటల్లోనే 24 మంది మరణించారు. ఇందులో 12 మంది నవజాత శిశువులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వివిధ ఆరోగ్య సమస్యలతో పాటు ఎక్కువగా పాము కాట్ల వల్ల మరణించినట్లు నాందేడ్ శంకర్రావ్ చవాన్ ప్రభుత్వ ఆస్పత్రి డీన్ తెలిపారు.

24 గంటల్లో ఆరుగురు మగ, ఆరుగు ఆడ శిశువులు మరణించారు. పన్నెండు మంది పెద్ద వారిలో చాలా మంది అనారోగ్య కారణాల వల్ల చనిపోయారు. ఎక్కువగా పాముకాట్లకు గురైన రోగులు మరణించినట్లు చెప్పారు. దీంతో పాటు సిబ్బంది ట్రాన్స్‌ఫర్లు ఈ సమస్యకు కారణమయ్యాయని డీన్ వెల్లడించారు. 80 కిలోమీటర్ పరిధిలో ఉన్న ఏకైక పెద్ద ఆస్పత్రి అని, రోగులు దూర ప్రాంతాల నుంచి వస్తున్నారని, కొన్ని రోజులుగా రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిందని ఆయన చెప్పారు. మేము మందులు కొనాల్సి ఉంది, కానీ అలా జరగలేదని, స్థానికంగా మందులు కొనుగోలు చేసి రోగులకు అందిచామని డీన్ వెల్లడించారు.

ఈ మరణాలు దురదృష్ణకరమని సీఎం ఏక్ నాథ్ షిండే అన్నారు. ఆస్పత్రిలో ఏం జరిగిందనే దానిపై మరింత సమాచారం సేకరించి చర్యలు తీసుకుంటామని అన్నారు. మహరాష్ట్రలో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్( బీజేపీ, ఏక్ నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీ)పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

మొత్తం 24 మంది ప్రాణాలు కోల్పోయారు. 70 మంది విషమంగా ఉన్నారు. వైద్య సదుపాయాలు సిబ్బంది కొరత ఉందని, చాలా మంది నర్సులను బదిలీ చేశారని, ఖాళీలను భర్తీ చేయలేదని మహరాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ అన్నారు. ఈ మరణాలకు ట్రిపుల్ ఇంజన్ సర్కార్ బాధ్యత వహించాలని శరద్ పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 12 Newborns Die
  • CM Eknath shinde
  • Maharashtra
  • nanded
  • Shankarrao Chavan Government Hospital

తాజావార్తలు

  • PAKISTAN: ప్రపంచానికి మధ్యవర్తిగా బిల్డప్.. కానీ హోటల్ బిల్లులు కట్టలేని పరిస్థితి!

  • VF MPV 7: విన్‌ఫాస్ట్ VF MPV 7 వచ్చేస్తోంది.. 500KM రేంజ్, 7 సీట్లు, ధర ఎంత? పూర్తి సమాచారం

  • TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ ‘‘కార్పొరేట్ జిహాద్’’ కేసులో సంచలన విషయాలు..!

  • KKR Vs CSK: కేకేఆర్ టార్గెట్ 193.. మరోసారి కీలక పాత్ర పోషించిన సంజూ..

  • Job Racket: యూరప్ వెళ్లాలనుకున్న నిరుద్యోగులు.. చివరకు చేరింది ఎక్కడికో తెలుసా..?

ట్రెండింగ్‌

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • మిలిటరీ స్టాండర్డ్ డ్యూరబిలిటీ + పవర్ ప్యాక్ ఫీచర్లు.. OPPO A6s Pro లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions