Ganesh Idol Collapse: గణేష్ ఆగమనం వేడుకలో ఘోర ప్రమాదం.. 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు మృతి
- గణేష్ వేడుకల్లో అపశృతి
- ముంబైలో 22 అడుగుల గణేశ విగ్రహం కూలి ఇద్దరు మృతి
- ఐదుగురికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai Ganesh Idol Collapse: ముంబైలో గణేశోత్సవ సన్నాహాల వేళ విషాద ఘటన చోటుచేసుకుంది. భూలేశ్వర్ ప్రాంతంలో గణేష్ ఆగమనం సందర్భంగా భారీ గణేశ విగ్రహం కూలిపోవడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిలో 5, 7 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలికలు కూడా ఉన్నారు. శనివారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో భూలేశ్వర్‌లోని బలరామ్ మర్చంట్ రోడ్డులో కబూతర్‌ఖానా సమీపంలోని జై అంబే చౌక్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.
‘భూలేశ్వర్ చా రాజా’గా పిలిచే సుమారు 22 అడుగుల ఎత్తైన గణేశ విగ్రహాన్ని స్వాగత కార్యక్రమం కోసం అక్కడికి తీసుకువస్తుండగా ఒక్కసారిగా కూలిపోయింది. భారీ విగ్రహం కిందపడటంతో అక్కడ ఉన్న పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ముంబై అగ్నిమాపక దళం, పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.
Also Read
- PM Modi: ‘దేశమే ప్రథమం’.. దేశ శత్రువులను గుర్తించి ఓడించాలి.. విజయదశమి వేళ ప్రధాని మోదీ పిలుపు.!
- Abhjeet Dipke: ‘‘దీపావళి వరకు వద్దు’’.. CJP నిరసనలపై అభిజిత్ దీప్కే మెసేజ్..
- Congress: పొత్తు పంచాయతీ.. యూపీలో 125 సీట్లు కోరుతున్న కాంగ్రెస్..
- Dussehra 2026: ఈ దసరాకు రావణుడితో పాటు ‘‘బొద్దింక’’ దహనం..!
ఇద్దరు మృతి.. ఐదుగురికి గాయాలు
మున్సిపల్ అధికారుల వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో సంకేత్ నెవ్షే (33), బ్రిజేష్ హేమంత్ జోషి (30) తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనలో వైభవ్ ఘెనంద్ (38), పవన్ చౌరాసియా (25), లావణ్య గానెర్ (5), దివ్య గానెర్ (7), కునాల్ కాశీద్ (26) గాయపడ్డారు. వీరంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.
వైభవంగా జరిగే గణేశోత్సవం
ముంబైతో పాటు మహారాష్ట్ర వ్యాప్తంగా గణేశోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. పది రోజుల పాటు జరిగే ఈ పండుగలో ఇళ్లతో పాటు భారీ పండాల్‌లలో వినాయక విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. విగ్రహాలను పండాల్‌లకు తీసుకువచ్చే సమయంలో భారీ ఊరేగింపులు నిర్వహించడం ఆనవాయితీ. డప్పులు, తాళాల మోతల మధ్య వేలాది మంది భక్తులు ఈ ఊరేగింపుల్లో పాల్గొంటారు. అయితే భూలేశ్వర్‌లో జరిగిన ఈ ప్రమాదం గణేశ విగ్రహం రాక సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలోనే చోటుచేసుకోవడం విషాదాన్ని నింపింది.
వేలాది పండాల్‌లకు అనుమతులు
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం, ఈ ఏడాది గణేశోత్సవం కోసం పండాల్‌ల ఏర్పాటుకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)కి 3,767 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 2,729 దరఖాస్తులకు అనుమతి లభించింది. 2022లో 3,487 దరఖాస్తులు రాగా, 2,417 మండపాలకు అనుమతులు మంజూరు చేశారు. ఈ ఏడాది గణేష్ చతుర్థి సెప్టెంబర్ 14న జరగనుంది. పండుగకు సన్నాహాలు కొనసాగుతున్న సమయంలోనే ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో భారీ విగ్రహాల రవాణా, భద్రతా ఏర్పాట్లపై మరోసారి దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది.
#WATCH | मुंबई, महाराष्ट्र | भुलेश्वर इलाके में बलराम मर्चेंट रोड पर 'भुलेश्वर चा राजा' की गणेश प्रतिमा के आगमन जुलूस के दौरान प्रतिमा गिरने से दो लोगों की मौत हो गई और पांच लोग घायल हो गए।
मृतकों के नाम संकेत नेवशे (33) और बृजेश हेमंत जोशी (30) हैं; अस्पताल लाने पर दोनों को मृत… pic.twitter.com/ijX0cdHgwI
— ANI_HindiNews (@AHindinews) August 22, 2026
తాజావార్తలు
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
IND-W vs ZIM-W: హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. జింబాబ్వే ముందు భారీ టార్గెట్.!
-
PM Modi: ‘దేశమే ప్రథమం’.. దేశ శత్రువులను గుర్తించి ఓడించాలి.. విజయదశమి వేళ ప్రధాని మోదీ పిలుపు.!
-
MVSR College : దాండియా వేడుకలో ప్రాణం తీసిన నిర్లక్ష్యం.. ముగ్గురు అరెస్ట్
-
Hyderabad Fake Snacks Raid: పిల్లలు తినే స్నాక్సేనా ఇవి.? కాటేదాన్‌లో 55 టన్నులు సీజ్.!
ట్రెండింగ్
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!