NTV Telugu Site icon

Fishermens Arrest: శ్రీలంక నేవీ అదుపులో 22 మంది తమిళ మత్స్యకారులు..

Srilanka

Srilanka

Fishermens Arrest: సముద్ర సరిహద్దు దాటినందుకు గాను 22 మంది భారతీయ మత్య్సకారులను శ్రీలంక నేవీ అధికారులు తాజాగా అరెస్ట్ చేశారు. భారత్- శ్రీలంక మధ్య లోతైన సముద్రంలో చేపల వేటకు వెళ్లిన తమిళ మత్స్యకారులను అరెస్టు చేశారని, వారి నుంచి రెండు మెకనైజ్డ్ పడవలను శ్రీలంక నావికాదళం స్వాధీనం చేసుకున్నట్టు తరువైకులం మత్స్యకారుల సంఘం ప్రకటించింది. ఒక బ్యాచ్‌లో 12, మరో బ్యాచ్‌కు చెందిన 10 మందిని గల్ఫ్ ఆఫ్ మన్నార్ లో అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

Read Also: Dinesh Karthik: మళ్లీ బ్యాట్ పట్టనున్న దినేష్ కార్తీక్.. తొలి క్రికెటర్‌గా రికార్డు!

కాగా, ఈ ఘటనలపై తమిళనాడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై స్పందించారు. శ్రీలంక నేవీ నుంచి తమిళ మత్య్స కారులు ఎదుర్కొంటున్న నిరంతర దాడులపై చర్చించడానికి ఢిల్లీలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో భేటీ అయ్యారు. మత్స్యకారుల సంఘం ప్రతినిధులను కూడా ఆయనతో పాటు తీసుకుపోయారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై చర్చించిన తర్వాత.. కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్ మాట్లాడుతూ.. సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇది రాజకీయ సమస్య కాకూదడు.. మత్య్స కారుల జీవనోపాధికి సంబంధించిన అంశమన్నారు. మత్స్యకారుల సంఘం, సంయుక్త కార్యవర్గంతో త్వరలోనే సమావేశం అవుతామని జై శంకర్ వెల్లడించారు. అయితే, గత వారం శ్రీలంక నేవీ అరెస్టు చేసిన 21 మంది జాలర్లను తిరిగి భారతదేశానికి పంపించింది. కొలంబోలోని భారత హైకమిషన్ జాఫ్నాలోని భారత కాన్సులేట్, శ్రీలంక అధికారుల సహకారంతో ఈ ప్రొగ్రాం చేపట్టారు. ఈ ఘటన జరిగిన వారం రోజుల తర్వాత మరో 22 మందిని శ్రీలంక నావికదశం అరెస్టు చేయడం గమనార్హం.

Show comments