Site icon NTV Telugu

IVF Case: బిడ్డకు జన్మనిచ్చి చిక్కుల్లో పడిన సిద్దూ మూసేవాలా తల్లిదండ్రులు.. కారణం ఏంటంటే.?

Sidhu Moose Wala

Sidhu Moose Wala

IVF Case: దివంగత పాప్ సింగర్ సిద్ధు మూసేవాలా తల్లి ఇటీవల ఐవీఎఫ్ పద్ధతి ద్వారా మరో బిడ్డకు జన్మనిచ్చారు. అయితే, ప్రస్తుతం ఇది వివాదాస్పదమైంది. అయితే, 21-50 ఏళ్ల వయసు ఉన్న మహిళలు మాత్రమే ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) అర్హులనే విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. సిద్దూ మూసేవాలా తల్లి చరణ్ కౌర్ వయసు 58 ఏళ్లు. మే 29, 2022లో పంజాబ్ మాన్సాలో 28 ఏళ్ల సిద్దూ మూసేవాలా హత్యకు గురయ్యారు. దాదాపు రెండేళ్ల తర్వాత ఆయన తల్లిదండ్రులు ఐవీఎఫ్ ద్వారా మరో బిడ్డకు జన్మనిచ్చారు.

Read Also: AP Elections: ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ టీజర్ పొలిటికల్ ప్రచారం తరహాలో ఉంటే పర్మిషన్ తీసుకోవాలి..!

ఈ విషయంపై మార్చి 14న పంజాబ్ ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది. ఐవీఎఫ్ చికిత్సపై నివేదిక కోరింది. ఫిబ్రవరి 27న ఓ వార్తా పత్రిక కథనం ఆధారంగా చరణ్ కౌర్ ఐవీఎఫ్ ద్వారా బిడ్డను జన్మించిందని తెలుసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. పంజాబ్ ప్రభుత్వానికి కేంద్ర మంత్రిత్వ శాఖ లేఖను ధృవీకరిస్తూ.. పంజాబ్ లోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం బుధవారం ట్వీట్ చేసింది. ‘‘ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఎల్లప్పుడూ పంజాబీల మనోభావాలను, గౌరవాన్ని గౌరవిస్తారని, కేంద్ర ప్రభుత్వమే డాక్యమెంట్స్ కావాలని కోరింది’’ అని ట్వీట్ చేసింది.

కేంద్రం నివేదిక కోరగా.. ఆప్ ప్రభుత్వం స్పందించింది. వాస్తవాలను పరిశీలించాలని, ఎలాంటి పుకార్లను నమ్మవద్దని ప్రజలను కోరింది. ఇదిలా ఉంటే మంగళవారం సిద్దూ మూసేవాలా తండ్రి బల్కౌర్ సింగ్ మాట్లాడుతూ.. భగవంత్ మాన్ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వం మార్చి 17న జన్మించిన తమ రెండో కుమారుడిని వేధింపులకు గురిచేస్తోందని, బిడ్డకు సంబంధించిన పత్రాలను అందించమని అడుగుతున్నట్లు ఆరోపించారు. ఈ చిన్నారికి చట్టబద్ధత ఉందని నిరూపించేందుకు నన్ను ప్రశ్నిస్తున్నారు అని ఇన్‌స్టాగ్రామ్‌ వీడియోలో పేర్కొన్నారు. ఐవీఎఫ్ చికిత్స ద్వారా తమకు రెండో బిడ్డ పుట్టినట్లు ఆయన పేర్కొనలేదు. తాను అన్ని చట్టపరమైన విధానాలను అనుసరించినందుకు అన్ని పత్రాలను అందచేస్తాని బల్కౌర్ సింగ్ చెప్పారు.

Exit mobile version