NTV Telugu Site icon

West Bengal: బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో రక్తపాతం.. 20కి చేరిన మరణాల సంఖ్య..

West Bengal

West Bengal

West Bengal: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో తీవ్ర హింస చెలరేగింది. ఎన్నికల ప్రకటన వచ్చినప్పటి నుంచి ఆ రాష్ట్రంలో పలు జిల్లాలో రాజకీయ కక్షలు పెరిగాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), ప్రతిపక్ష బీజేపీ, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్, వామపక్ష పార్టీల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఒకరిపై ఒకరు దాడులకు తెగబడ్డారు. శనివారం ఎన్నికల రోజు కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. పలు పార్టీల కార్యకర్తలు మరణించారు.

ఎన్నికల తర్వాత రోజు కూడా దాడులు కంటిన్యూ అయ్యాయి. ఆదివారం ఉదయం మాల్డాలో టీఎంసీకి చెందిన ఇద్దరు కార్యకర్తలు కత్తిపోట్లకు గురై మరణించారు. దీంతో ఎన్నికలకు సంబంధించిన హింసలో ఇప్పటి వరకు 20 మంది మరణించారు. ఎన్నికల అనంతరం మాల్దాలోని బైష్ణవనగర్ లో ఈ ఘటన జరిగింది. మృతుల్లో ఒకరైన టీఎంసీ కార్యకర్త మాటియుర్ రెహ్మన్ పోలింగ్ స్టేషన్ కి వచ్చిన సమయంలో కొంతమంది చుట్టుముట్టి కత్తితో పొడిచి చంపారు. ఈ హత్యకు కాంగ్రెస్ కారణమని అధికార టీఎంసీ ఆరోపించింది. ఈ ఘర్షణలో మరో ఆరుగురు కూడా గాయపడ్డారు. దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించారు.

Read Also: Digvijaya Singh: ఆర్ఎస్ఎస్ మాజీ చీఫ్ ఫోటోతో రెచ్చగొట్టే ప్రయత్నం.. కాంగ్రెస్ నేతపై పోలీస్ కేసు..

మరో టీఎంసీ కార్యకర్త అజహర్ లష్కర్ పై దక్షిణ 24 పరగణాల జిల్లాలోని బసంతిలో దాడి జరిగింది. టీఎంసీ, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ కార్యకర్తల మధ్య జరిగిన దాడిలో అతను మరణించాడు. శనివారం ఓటింగ్ ముగియడంతో బెంగాల్ గ్రామీణ ప్రాంతాల్లో హింస చెలరేగింది. బ్యాలెట్ బాక్సుల్ని ధ్వంసం చేశారు. అనేక గ్రామాల్లో ప్రత్యర్థులపై బాంబు దాడులు జరిగాయి. శనివారం రోజున కూడా హింస చెలరేగింది. 10కి పైగా మంది ఈ ఘర్షణల్లో చనిపోయారు.

అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అనేక పోలింగ్ బూత్ లలో రీపోలింగ్ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు జరిగినా కూడా రక్తపాతం జరిగింది. గత నెల ఎన్నికల ప్రకటన వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో 30 మంది మరణించారు. 2018 ఎన్నికల్లో కూడా ఇదే విధంగా హింసాకాండ చెలరేగింది.