Site icon NTV Telugu

Anant Ambani wedding: అంబానీ వివాహ కార్యక్రమంలోకి వెళ్లేందుకు యత్నించిన ఇద్దరు ఏపీ వాసులు..

Ambani Wedding

Ambani Wedding

Anant Ambani wedding: రిలయన్స్ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంగరంగ వైభవంగా అనంత్ అంబానీ వివాహ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ నుంచి ప్రముఖ రాజకీయ నాయకులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ప్రపంచ ప్రఖ్యాత సెలబ్రెటీలు ఈ వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ వివాహం కోసం అంబానీ ఏకంగా రూ. 5000 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Read Also: Madhya Pradesh: 7వ తరగతి విద్యార్థినిపై 9వ తరగతి విద్యార్థి అత్యాచారం..

బాలీవుడ్ స్టార్లతో పాటు ప్రముఖ వ్యక్తులు హాజరవుతున్న ఈ వివాహ కార్యక్రమంలోకి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించేందుకు ప్రయత్నించారు. వివరాల ప్రకారం ఆహ్వానం లేకుండా ఈ వివాహ కార్యక్రమంలోకి ప్రవేశించేందుకు యత్నించిన ఇద్దర్ని ముంబైలో అరెస్ట్ చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. అరెస్టైన వ్యక్తుల్ని వెంకటేష్ నరసయ్య (26), లుకం మహ్మద్ షఫీ షేక్(28)గా గుర్తించారు. వీరిద్దరు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వారిగా పోలీసులు చెప్పారు. వెంకటేష్ తనను తాను యూట్యూబర్‌గా, షఫీ షేక్ వ్యాపారవేత్తగా చెప్పుకున్నారు.

వీరిద్దరు వివాహ వేడుకల్ని చూసేందుకు ఏపీ నుంచి ముంబై వచ్చినట్లు పోలీసులు తెలిపారు. వివాహ కార్యక్రమం జరుగుతున్న జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌కి వచ్చారు, అనుమానం రావడంతో భద్రతా సిబ్బంది అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. వీరిని బీకేసీ పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. వీరిపై అతిక్రమణ కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Exit mobile version