Site icon NTV Telugu

Tejas Fighter Jet: 23 ఏళ్ల చరిత్రలో తొలిసారి తేజస్ ఫైటర్ జెట్ క్రాష్..

Tejas

Tejas

Tejas Fighter Jet: పూర్తిగా స్వదేశీ టెక్నాలజీపై ఆధారపడి తయారైన తేలికపాటి యుద్ధ విమానం ‘తేజస్’ రాజస్థాన్‌లో కుప్పకూలింది. 23 ఏళ్ల తేజస్ చరిత్రలో తొలిసారిగా విమానం క్రాష్ అయింది. జైసల్మేర్‌లోని హాస్టల్ కాంప్లెక్స్ సమీపంలో కుప్పకూలింది. పైలెట్ ఎజెక్షన్ ద్వారా ప్రాణాలతో బయటపడ్డారు. 2001లో టెస్ట్ ఫ్లైట్ ద్వారా ప్రారంభమైన ఈ స్వదేశీ యుద్ధవిమానం కూలిపోవడం ఇదే తొలిసారి.

సింగిల్ సీటర్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్, ట్విన్ సీట్ ట్రైనర్ వేరియంట్‌లో కూడా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ద్వారా నిర్వహించబడుతోంది. ఇండియన్ నేవీ కూడా ట్విన్ సీటర్ వేరియంట్‌ని ఉపయోగిస్తోంది. తేజస్‌కి సంబంధించి టెక్నాలజీ డెమోన్‌స్ట్రేటర్-1(TD-1) యొక్క మొదటి టెస్ట్ ఫ్లైట్ 2001లో జరిగింది. ఇనిషియల్ ఆపరేషనల్ క్లియరెన్స్ (IOC) కాన్ఫిగరేషన్‌ సెకండ్ సిరీస్ ప్రొడక్షన్ (SP2) తేజాస్ ఎయిర్‌క్రాఫ్ట్ ఫస్ట్ ఫ్లైట్ మార్చి 22, 2016న జరిగింది.

Read Also: Athadu Vs Jalsa: ఏమైందిరా మీకు.. ఎందుకురా ఇప్పుడు వీటిమీద కొట్టుకుంటున్నారు

లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ 4.5 జనరేషన్ మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్‌గా పేరు తెచ్చుకుంది. తేజస్ విమానం చిన్నది, తేలికపాటి విమానం. 2016లో తొలిసారిగా తేజస్‌ని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ స్క్వాడ్రన్‌లో ప్రవేశపెట్టారు. ప్రస్తుత ఐఏఎఫ్ 40 తేజస్ ఎంకే-1 విమానాలను నిర్వహిస్తోంది. రూ. 36,484 కోట్ల విలువైన మరో 83 తేజస్-ఎంకే 1 విమానాలకు ఆర్డర్ ఇచ్చింది.

పైలెట్ల ప్రాణాలను హరిస్తున్న మిగ్-21 విమానాలను 2025 నాటికి తేజస్ మార్క్ 1ఏ విమానంతో భర్తీ చేయాలని భారత వైమానిక దళం భావిస్తోంది. 1963 నుండి వైమానిక దళానికి సేవలందిస్తున్న MiG-21ల స్థానంలో లైట్ కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ (ఎల్ఏసీ) కార్యక్రమాన్ని 1980 చివర్లో రూపొందిచారు. 2003లో ఎల్ఏసీకి ‘తేజస్’గా పేరు పెట్టారు.

Exit mobile version