Gujarat: ఒక్కసారి తలదించి నన్ను చూస్తే జీవితంలో నిన్ను తలదించకుండా చేస్తాను అంటుంది పుస్తకం. తలరాతను మర్చి రాసుకోవాలి అంటే మంచిగా చదువుకోవాలి. కాని.. కొందరికి చదువుకోవాలి అని ఉన్న.. మౌలిక సదుపాయాలు లేక చదువుకోలేక పోతున్నారు. అయితే మనసుంటే మార్గం ఉటుంది. మనిషి తలచుకుంటే సాధించలేనిదంటూ ఏది లేదు. అని నిరూపించారు ఓ గ్రామీణ యువత. వివరాల లోకి వెళ్తే.. గుజరాత్ లోని దాహోద్ జిల్లా లోని పావ్‌డి గ్రామం.. మారుమూల గిరిజన ప్రాంతం కావడం చేత కనీస సదుపాయాలకు కూడా నోచుకోలేదు. అలా అని ఆ గ్రామ ప్రజలు నిరుత్సహ పడలేదు. మనం ఏం చెయ్యగలంలే అని ఊరుకోలేదు. రేపటి తరాల భవిష్యత్తును మార్చగల శక్తి కేవలం విద్యకే వుంది అని తెలుసుకున్న ఆ గ్రామ వాసులు ఓ అద్భుతమైన గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
విద్యార్థులకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని 2017 లో గ్రామస్తులంతా కలిసి ఈ గ్రంథాలయాన్ని నిర్మించుకున్నారు. కాగా కేవలం ఈ గ్రంధాలయం కోసమే 2018 లో ఓ ఇంటిని కేటాయించారు. కాగా ఈ గ్రంథాలయాన్ని విద్యార్థులు ఎంతో చక్కగా వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ గ్రంథాలయాన్ని ఉపయోగించుకుని 2022-23 మధ్యలో అంటే కేవలం ఓ ఏడాది లోనే గ్రామానికి చెందిన 19 మంది విద్యార్థులు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు సంపాదించారు. ఈ నేపథ్యంలో లైబ్రరీ వ్యవస్థాపకులు సంజయ్ భాబోర్ మాటాడుతూ.. ఈ విద్యార్థులను చూసి గ్రామాల్లోని యువత ప్రేరణ పొందాలని సూచించారు.
