NTV Telugu Site icon

Daughter Killed Mother: మధ్యప్రదేశ్‌లో దారుణం.. ప్రేమ మాయలో పడి కన్నతల్లినే..

Daughter Kills Mother

Daughter Kills Mother

17 Year Old Girl Killed Her Mother With Help Of Her Lover: మధ్యప్రదేశ్‌లో సభ్యసమాజం తలదించుకునే ఓ దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుని ప్రేమ మాయలో పడి, తన కన్నతల్లినే కడతేర్చింది ఓ మైనర్. తమ ప్రేమకు అడ్డుగా ఉందని.. ఆమెను కత్తిపొట్లతో పొడిచి, అత్యంత క్రూరంగా చంపేసింది. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కి చెందిన ఓ మైనర్ (17) చాలాకాలం నుంచి ఒక అబ్బాయి (25)తో ప్రేమాయణం కొనసాగిస్తోంది. తమ కుటుంబ సభ్యులకు తెలియకుండా, చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. అయితే.. ఓరోజు వీళ్లిద్దరు యువతి తల్లి మమతా కుష్వాహా కంటపడ్డారు. ఆ అబ్బాయి ఎవరని నిలదీయగా.. తాను ప్రేమిస్తున్నానని ఆ యువతి తెలిపింది. దీంతో.. ఇంకోసారి ఆ అబ్బాయిని కలవొద్దని, ప్రేమ దోమా లాంటివన్నీ మానెయ్యమని తల్లి సూచించింది. ఆ అబ్బాయికి కూడా వార్నింగ్ ఇచ్చింది. అయినా వాళ్లు ఆమె మాటలు పట్టించుకోకుండా.. తరచూ కలవడం మొదలుపెట్టారు.

Big Breaking: ఏపీ సర్కార్‌ సంచలన నిర్ణయం.. సభలు, ర్యాలీలపై నిషేధం

కట్ చేస్తే.. రెండు నెలల క్రితం ఆ అమ్మాయి తన ప్రియుడితో కలిసి ఇంట్లో నుంచి పారిపోయింది. అప్పుడు వాళ్లు శారీరకంగా కలిశారు. ముందునుంచి వీరి ప్రేమను వ్యతిరేకిస్తున్న తల్లి మమతా.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కూతురు మైనర్ అని, మాయమాటలు చెప్పి ఆ యువకుడు తన కూతుర్ని కిడ్నాప్ చేశాడని ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. వారి ఆచూకీ కనుగొన్నారు. అబ్బాయిని అరెస్ట్ చేసి జైల్లో వేయగా, అమ్మాయిని తల్లి మమతాకి అప్పగించారు. జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన ఆ అబ్బాయి.. మళ్లీ అమ్మాయిని కలవడం మొదలుపెట్టాడు. దీంతో మమతా మరోసారి అతడ్ని హెచ్చరించింది. తన కూతుర్ని మరోసారి కలవడానికి ప్రయత్నిస్తే, తీవ్ర పరిణామాలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే తమ ప్రేమకు తల్లి అడ్డుపడుతోందని, కూతురు ఆమెపై కక్ష పెంచుకుంది. ఆమె అడ్డు తొలగించుకోవాలంటే.. అంతమొందించడమే మార్గమని నిర్ణయించుకుంది. ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్ వేసింది. తొలుత కత్తితో మమతా గొంతు కోసిన వాళ్లిద్దరు.. ఆ తర్వాత విచక్షణారహితంగా పొడిచి, కిరాతకంగా చంపేశారు.

Instagram Job Fraud: ఆన్‌లైన్‌ మోసం.. ఉద్యోగం పేరుతో యువతికి టోకరా

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ ఇద్దరినీ అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై గ్వాలియర్ ఎస్పీ అమిత్ సంఘీ మాట్లాడుతూ.. ‘‘శనివారం తన ప్రియుడితో కలిసి మైనర్ అమ్మాయి తల్లిని హతమార్చింది. ఆదివారం ఉదయం వాళ్లిద్దరినీ మేము అరెస్ట్ చేశారు. నేరకార్యకలాపాలకు పాల్పడే యువకుడితో ఆ అమ్మాయికి రిలేషన్‌షిప్ ఉందని తెలిసింది. మృతురాలి ఫిర్యాదు మేరకు మేము రెండు నెలల క్రితమే నిందితుడ్ని అరెస్ట్ చేశాం. అయితే.. అతడు గత నెల బెయిల్‌పై విడుదల అయ్యాడు. ఇంతలోనే తన ప్రియురాలితో కలిసి ఈ కిరాతకానికి పాల్పడ్డాడు’’ అని చెప్పారు.

Kakinada Fire Accident: కాకినాడ గొల్లప్రోలులో భారీ అగ్నిప్రమాదం.. నిప్పంటించి దుండగులు పరార్

Show comments