NTV Telugu Site icon

Gurugram: కార్ల వర్క్‌షాప్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 16 లగ్జరీ కార్లు దగ్ధం

Gurugramworkshop

Gurugramworkshop

హర్యానాలోని గురుగ్రామ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ కార్ల వర్క్‌షాప్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో 16 లగ్జరీ కార్లు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో దాదాపు రూ.7 కోట్లు విలువైన కార్లు బూడిదయ్యాయని సమాచారం.

ఇది కూడా చదవండి: Tamil Nadu: కొడైకెనాల్‌లో విషాదం.. యువకుల ప్రాణాలు తీసిన బార్బీ క్యూ చికెన్

సెక్టార్‌ 41 ఏరియా మోతీ విహార్‌ ప్రాంతంలోని బెర్లిన్‌ మోటార్‌ వర్క్‌షాప్‌లో శనివారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఆ సమయంలో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అయితే.. పలు ఖరీదైన కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. పదహారు లగ్జరీ కార్లు వర్క్‌షాప్‌లో పార్క్‌ చేశారని.. ఇవన్నీ కాలి బూడిదయ్యాయని అగ్నిమాపక అధికారులు తెలిపారు. వీటితోపాటు కొన్ని పాత వాహనాలు కూడా దగ్ధమైనట్లు చెప్పారు. సమాచారమందుకున్న వెంటనే ఘటనాస్థలికి వెళ్లి మంటలను ఆర్పివేశామని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: PM Modi-Aman Sehrawat: ‘మీ జీవితం దేశప్రజలకు స్ఫూర్తిదాయకంగా మారుతుంది’.. అమన్తో ఫోన్లో ప్రధాని

మెర్సిడెస్, ఆడి క్యూ 5, బీఎమ్‌డబ్ల్యూ, రేంజ్ రోవర్, వోల్వో, ఫోర్డ్ ఎకో స్పోర్ట్, ఒపెల్ ఎస్ట్రా మరియు జాగ్వార్‌తో సహా పదహారు అత్యాధునిక కార్లు వర్క్‌షాప్‌లో పార్క్ చేశారు. ఇవన్నీ బూడిదగా మారాయి. అగ్నిప్రమాదంలో కొన్ని స్క్రాప్డ్ వాహనాలు కూడా దగ్ధమైనట్లు అధికారి తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మూడు గంటలపాటు శ్రమించి మంటలను ఆర్పివేశారని వెల్లడించారు. అగ్నిప్రమాదానికి కారణం ఇంకా తెలియబడలేదన్నారు.