NTV Telugu Site icon

Rajasthan: ఉదయ్‌పూర్ మత ఘర్షణలకు కారణమైన ఘటనలో బాలుడు మృతి..

Udaipur, Udaipur Violence

Udaipur, Udaipur Violence

Rajasthan: ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో మత ఘర్షణలకు కారణమైంది. ప్రభుత్వ పాఠశాలో పదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలుడు దేవరాజ్ అనే బాలుడిపై మైనారిటీ వర్గానికి చెందిన మరో బాలుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన తర్వాత నగర వ్యాప్తంగా మతపరమైన హింస చోటు చేసుకుంది. గాయపడిన బాలుడు నాలుగు రోజుల చికిత్స తర్వాత ఈ రోజు మరణించాడు.

నాలుగు రోజుల పాటు ప్రాణాల కోసం పోరాడిన తర్వాత సోమవారం మరణించాడు. బాలుడు తుదిశ్వాస విడిచే కొన్ని గంటల ముందు అతని సోదరి రక్షాబంధన్ సందర్భంగా ఆస్పత్రిలో రాఖీ కట్టిందని ఉదయ్‌పూర్ కలెర్టర్ అరవింద్ పోస్వాల్ తెలిపారు. ప్రస్తుతం బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని ఉదయ్‌పూర్ రేంజ్ ఐజీ అజయ్ పాల్ లాంబా తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగిస్తామని తెలిపారు. ఈ ఘటనలో నేరానికి పాల్పడిన నిందితుడి ఇంటిని అధికారులు కూల్చేశారు.

Read Also: Crime News: రాఖీ కోసం ఇంటికి వచ్చిన యువకుడిని గన్తో కాల్చి చంపిన దుండగులు..

ఇదిలా ఉంటే శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా బలగాలను మోహరించారు. నగరంలోని సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను పెట్టారు. శుక్రవారం ఏదో గొడవలో పాఠశాల వెలుపల దేవరాజ్ అనే విద్యార్థిని తోటి విద్యార్థి కత్తితో పొడిచాడు. ఈ ఘటనలో దాడి చేసిన వ్యక్తి మైనారిటీ కావడం, గాయపడిన వ్యక్తి మెజారిటీ వర్గం కావడంతో ఒక్కసారిగా నగరంలో మతపరమైన హింస చోటు చేసుకుంది. ఈ ఘటనను నిరసిస్తూ హిందూ సంఘాల సభ్యులు ఆందోళనకు దిగారు. ఘర్షణలు పెరగడంతో కార్లు, బైకులకు నిప్పటించారు. మాల్స్‌పై రాళ్లు రువ్వారు. ఈ నేపథ్యంలో ఘర్షణల నేపథ్యంలో అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలను మూసివేసి, మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసారు. అలాగే నగరంలో ప్రజలు గుమిగూడడాన్ని నిషేధిస్తూ నిషేధాజ్ఞలు విధించారు.