NTV Telugu Site icon

Nepal: నేపాల్‌లో వరదల బీభత్సం.. 14 మంది మృతి, 9 మంది మిస్సింగ్..

Nepal

Nepal

Nepal: నేపాల్ దేశాన్ని భారీ వర్షాలు భయపెడుతున్నాయి. వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడుతుండటంతో ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల దేశవ్యాప్తంగా 14 మంది మరణించారు. మరో 9 మంది గల్లంతైనట్లు అక్కడి పోలీసులు ఆదివారం తెలిపారు. నేపాల్ మాత్రమే కాకుండా భారత్ లోని హిమాలయ రాష్ట్రాల్లో, బంగ్లాదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో వరదలు తీవ్ర నష్టాలను కలిగించాయి. వీటి వల్ల మిలియన్ల మంది ప్రభావితమయ్యారు.

Read Also: Raj Tarun Lover Lavanya: రాజ్‌తరుణ్‌కు చాలా మందితో ఎఫైర్స్‌.. లావణ్య షాకింగ్‌ కామెంట్స్!

జూన్ నుండి సెప్టెంబరు వరకు రుతుపవనాల వర్షాలు దక్షిణ ఆసియా అంతటా ప్రతి సంవత్సరం విస్తృతంగా మరణాలు, విధ్వంసాలకు కారణమవుతున్నాయి. వాతావరణ మార్పులు, రోడ్ల నిర్మాణం పెరగడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతోంది. నేపాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో గురువారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో హిమాలయ దేశంలోని అధికారులు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు.

మరోవైపు భారత్‌లోని అస్సాంను వరదలు ముంచెత్తున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గంగా నది ప్రవాహం పెరిగింది. అస్సాంలో మే నుంచి కురుస్తున్న వర్షాల కారనంగా మరణించిన వారి సంఖ్య 58కి చేరుకుంది.