Site icon NTV Telugu

MP Shocker: పోర్న్‌ చూసి దారుణం.. 9 ఏళ్ల సోదరిపై 13 ఏళ్ల బాలుడి అత్యాచారం, హత్య..

Crime

Crime

MP Shocker: ఇటీవల కాలంలో ఇంటర్నెట్‌లో ‘పోర్న్’ విపరీతంగా చూడటం నేరాలకు కారణమవుతోంది. మైనర్లు అత్యాచారాలకు, హత్యలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ తగ్గడం కూడా పోర్న్ అడిక్షన్‌ని పెంచుతోంది. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన ఈ జాఢ్యం ఎంతలా పెరిగిందనే విషయాన్ని తెలియజేస్తోంది.

మధ్యప్రదేశ్ రేవాలో 13 ఏళ్ల బాలుడు, 9 ఏళ్ల తన సోదరిపై అత్యాచారం చేసి, ఆమెను హత్య చేసిన సంఘటన సభ్యసమాజం తలదించుకునేలా చేసింది. ఈ హత్యను ఛేదించడానికి 3 నెలల్లో 50కి పైగా డీఎన్‌ఏ టెస్టులు నిర్వహించగా, బాలిక ప్రైవేట్ పార్టులో దొరికిన వీర్యం డీఎన్ఏ ఆమె అన్నయ్యతో సరిపోలింది. ఈ కేసులో తలదించుకునే విషయం ఏంటంటే, నిందితుడిని రక్షించేందుకు తల్లి, ఇద్దరు అక్కాచెల్లిళ్లు ప్రయత్నించారు. ఈ కేసులో వీరిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

Read Also: High Court: పెళ్లైనవారి ‘‘సహ జీవనం’’పై హైకోర్టు సంచలన తీర్పు.. తల్లిదండ్రుల పరవు తీస్తున్నారంటూ..

వివరాల ప్రకారం.. మూడు నెలల క్రితం రేవాలోని జావా ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. నిందితుడు రాత్రి వేళల్లో మొబైల్ ఫోన్లలో పోర్న్ చూడటానికి అలవాటు పడ్డాడ. తన మంచం పక్కన నిద్రిస్తున్న సోదరిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని తండ్రికి చెబుతానని బెదిరించడంతో, బాలికను హత్య చేశాడు. ఈ కేసులో పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు 55 మంది డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారు. అయితే, మైనర్ శరీరంలో అభించిన డీఎన్ఏ ఎవరితోనూ సరిపోలతేదు. చివరకు బాలిక ప్రైవేట్ పార్టులో దొరికిన స్పెర్మ్ డీఎన్ఏ నిందితుడైన ఆమె అన్నతో సరిపోలింది. నిందితుడు అత్యాచారం చేసినట్లు అంగీకరించాడు. ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పాడు. వీరంతా అతడిని రక్షించే ప్రయత్నం చేశారు.

Exit mobile version