TVK Party: సినీ నటుడు దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీ బలోపేతానికి సన్నాహాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా 120 మంది జిల్లా కార్యదర్శులను నియమించేందుకు ఆ పార్టీ హైకమాండ్ ప్లాన్ చేస్తుంది. విల్లుపురం జిల్లా విక్రవాండిలో టీవీకే తొలి మహానాడు సక్సస్ కావడంతో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో చేపడుతున్నట్లు తెలిపారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా బుస్సీ ఆనంద్‌ను నియమిస్తూ పార్టీ చీఫ్ విజయ్ ప్రకటించారు.
Read Also: Health Benefits: ఉదయమే కాదు రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే ఎన్నో బెనిఫిట్స్..
అలాగే, మరి కొంత మంది రాష్ట్రస్థాయి నిర్వాహకులను కూడా మహానాడుకు ముందు టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ నియమించారు. జిల్లా స్థాయిలో నిర్వాహకులను ఇప్పటి వరకు టీవీకే నియమించలేదు. ఇదిలా ఉండగా, 2026లో తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో టీవీకే తరఫున ఆయా నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలు ఉన్న వారి వివరాలను సేకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. విజయ్ పార్టీలో 60 శాతం మందికి పైగా ఆయన ఫ్యాన్స్ సభ్యులుగా కొనసాగుతున్నారు. పార్టీకి జిల్లా కార్యదర్శులు వెన్నెముకలాంటి వారు కావడంతో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల్లో లాగే టీవీకేలో కూడా జిల్లా కార్యదర్శులను నియమించాలని విజయ్ అనుకుంటున్నారు.
Read Also: Russia- Ukraine Conflict: ఉక్రెయిన్‌పై 60 క్షిపణులతో రష్యా దాడి..
ఇక, పార్టీ తరఫున 120 జిల్లా విభాగాలకు సంబంధించిన జాబితాను రెడీ చేస్తున్నారు. ఇందులో తొలి విడతగా జిల్లా కార్యదర్శులను ఎంపిక చేయనున్నారు. ఇందు కోసం విజయ్ అభిమాన సంఘంగా ఉన్నప్పటి నుంచి ప్రతిఫలం ఆశించకుండా సమాజ సేవలో పాల్గొన్న వారు.. పార్టీ స్టార్ట్ చేసినప్పటి నుంచి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న వారి పేర్లను ఎంపిక చేసి త్వరలోనే వారిని ఇంటర్వ్యూ చేయనున్నట్లు సమాచారం. డిసెంబరు మొదటి వారం వరకు జిల్లా కార్యదర్శుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే ఛాన్స్ ఉందని తమిళగ వెట్రి కళగం నిర్వాహకులు చెప్పుకొచ్చారు.