Site icon NTV Telugu

Uttar Pradesh: 12 ఏళ్ల బాలికపై అత్యాచారం.. బిడ్డకు జన్మనిచ్చిన మైనర్

Uttar Pradesh

Uttar Pradesh

12-Year Old girl Gives Birth To Boy In UTTAR PRADESH: అభం శుభం తెలియన 12 ఏళ్ల బాలిక ఓ బిడ్డకు జన్మనిచ్చింది. బాలికను బెదిరించి ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రస్తుతం సదరు బాలిక మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ కు చెందిన 7వ తరగతి చదువుతున్న 12 ఏళ్ల బాలికపై ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఒకే అపార్ట్మెంట్ లో నివసిస్తున్న 19 ఏళ్ల వ్యక్తి బాలికపై కన్నేశాడు. బాలికను బెదిరించి లొంగదీసుకున్నారు. పదేపదే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు.

అతనితో పాటు అతని 21 ఏళ్ల సోదరుడు కూడా బాలికపై అత్యాచారం చేయడం ప్రారంభించాడు. ఇద్దరూ కూడా బాలికను బెదిరిస్తూ అనేక సార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. అంతే కాకుండా.. ఈ ఇద్దరు సోదరులతో కలిసి నివసిస్తున్న 16 ఏళ్ల బాలిక, డబ్బు కోసం బాధితురాలిని వేరే వ్యక్తికి అప్పగించింది. ఆ వ్యక్తి కూడా బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో బాలిక గర్భం దాల్చింది.

Read Also: Kerala: డాక్టర్ల నిర్లక్ష్యం ఐదేళ్లుగా మహిళ కడుపులో కత్తెర.. విచారణకు మంత్రి ఆదేశం

అయితే కుటుంబీకులు బాధితురాలు గర్భం దాల్చడాన్ని గమనించలేదు. బిడ్డను ప్రసవించే సమయం వరకు బాలిక సాధారణంగానే ఉంది. అయితే ఆస్పత్రికి తీసుకురాగా.. ఆమెకు కిడ్నీలో రాళ్లు ఉన్నాయని వైద్యులు శస్త్ర చికిత్స చేయాలని చెప్పారని బాలిక కుటుంబసభ్యులకు చెప్పింది. తీరా మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటనపై కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు అన్నదమ్ములతో పాటు 35 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 5న ఘజియాబాద్ ఖోడో స్టేషన్ లో ఫిర్యాదు నమోదు అయినట్లు పోలీస్ అధికారి అల్తాప్ అన్సారీ వెల్లడించారు. నిందుతులందరిని అరెస్ట్ చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసినట్టు వెల్లడించారు.

Exit mobile version