Team India rally effect: ముంబైలో భారీగా చెత్త.. శుభ్రం చేయడానికి కార్మికులకు ఇక్కట్లు
- ముంబైలో గురువారం క్రికెటర్లు భారీ ర్యాలీ
- ఎక్కడపడితే అక్కడే చెత్తేసిన అభిమానులు
- 11 వేలకు పైగా చెత్త సేకరించిన కార్మికులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబై మున్సిపల్ కార్మికులకు గురువారం రాత్రి నుంచి చుక్కలు కనిపించాయి. నగరంలో ఎన్నడూ చూడని చెత్తను చూసి వర్కర్స్ అవాక్కయ్యారు. కొన్ని గంటల పాటు వేల కిలోల వ్యర్థాలు సేకరించి రికార్డు సృష్టించారు.
టీమిండియా క్రికెటర్లు ఇటీవలే టీ 20 వరల్డ్ కప్ గెలుచుకున్నారు. గురువారం క్రికెటర్లంతా ముంబై చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో భారీ స్వాగతం లభించింది. అనంతరం అక్కడ నుంచి స్టేడియం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఇందుకోసం ముంబై నగరమంతా కదిలివచ్చింది. అభిమానులు, ప్రజలు ఊహించని రీతిలో తరలివచ్చారు. ఇసుక వేస్తే రాలనంతగా మెరైన్‌కు జనం వచ్చారు. దీంతో నగర వీధులన్నీ జనాలతో కిక్కిరిసిపోయాయి.
Also Read
- Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- Allahabad High Court: హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు..
- Gurmeet Ram Rahim Release: మరోసారి జైలు నుంచి బయటకు డేరా బాబా.. 17వ సారి పెరోల్‌పై విడుదల
- Sugar Price Hike: కొండెక్కుతున్న చక్కెర ధరలు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..

అయితే టీమిండియా క్రికెటర్లకు స్వాగతం పలికేందుకు వచ్చిన ప్రజలు.. తినేందుకు తెచ్చుకున్న స్నాక్స్, కూల్‌డ్రింక్స్, వాటర్ బాటిల్స్, ఆయా పదార్థాలకు సంబంధించిన వస్తువులు ఎక్కడ పడితే అక్కడ పడేశారు. దీంతో ముంబై ప్రధాన రహదారులన్నీ చెత్తాచెదారంతో నిండిపోయాయి. ర్యాలీ ముగిశాక రోడ్లు చూస్తే.. ఎటు చూసినా వ్యర్థాలతో రోడ్లు నిండిపోయాయి. పరిస్థితుల్ని చూసిన కార్మికులు షాక్ అయ్యారు. ఇక 100 మంది కార్మికులు శుభ్రం చేయడానికి రంగంలోకి దిగారు. అర్ధరాత్రి 11:30కి క్లీన్ చేయడం మొదలు పెడితే ఏకధాటిగా పని చేస్తే శుక్రవారం ఉదయం 8 గంటలకు పూర్తయ్యాయి. మొత్తం వ్యర్థాలను తూకం వేస్తే 11,500 కిలోల వ్యర్థాలు వచ్చాయి. చెత్తలో ప్లాస్టిక్ సీసాలు, చిప్స్ ప్యాకెట్లు, టీ కప్పులు, చిత్తు కాగితాలు, బట్టలు, బూట్లు, చెప్పులు, ఇలా రకరకాలైన వస్తువులు దర్శనమిచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
A big thank you to the sanitation workers of the Mumbai Municipal Corporation.
Before the citizens who celebrated the World Cup victory parade woke up, the sanitation workers had already cleaned and tidied up the Marine Drive area. The previous night, the Marine Drive area was… pic.twitter.com/VJvDaPDCUC
— Vaibhav Kokat (@ivaibhavk) July 5, 2024
తాజావార్తలు
-
Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
-
Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్‌క్రిస్ట్‌లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
-
Reservation Roster: డాక్టర్ల నియామకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం!
-
Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Gold and Silver Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. భారీగా దిగివచ్చిన వెండి.. నేటి రేట్లు ఇవే
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?