NTV Telugu Site icon

Himachal Pradesh: శుభకార్యానికి వెళ్తుండగా ప్రమాదం.. కారు వాగులో కొట్టుకుపోయి 11 మంది మృతి

Car

Car

చావు ఏ విధంగా వస్తుందో ఎవరికి తెలియదు.. ఓ వివాహ వేడుకకు అని బయల్దేరిన ఒకే కుటుంబానికి చెందిన 12 మంది సభ్యుల్లో 11 మంది మృతి చెందారు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. భటోలి గ్రామానికి చెందిన వీరంతా ఓ వివాహ శుభకార్యానికి అని బయల్దేరారు. అయితే.. మార్గమధ్యలో జెజో ప్రాంతంలో వాగులో పడి ఇన్నోవా కారు కొట్టుకుపోయింది. అందులో ప్రయాణిస్తున్న 12 మంది ప్రయాణిస్తున్నారు. అందులో 11 మంది చనిపోగా.. ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనతో వారి స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Read Also: Trai New Rule: ఇకపై అలాచేస్తే మీ సిమ్ 2 సంవత్సరాల పాటు బ్లాక్ లిస్ట్‭లో..

మృతులు సుర్జీత్ సింగ్ (55), పరమజీత్ కౌర్ (50), గగన్‌దీప్ (19), దీపక్ (22), రామ్ స్వరూప్, పల్వీందర్ కౌర్, నితిన్, శీను దేవి, అమ్రిక్ సింగ్, హర్షిత్, భావన, మన్నత్ గా గుర్తించారు. వీరంతా ఓ కారును బుక్ చేసుకుని మెహ్రోవాల్ గ్రామంలో జరిగే వివాహ వేడుకకు వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. జైజోన్‌ అనే ప్రాంతంలో ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులో కారు కొట్టుకుపోయింది. వాగు ఉధృతిని చూసిన డ్రైవర్.. కాసేపు ఆగి వెళ్దామనుకున్నాడు. అయితే కొన్ని వాహనాలు ఆ వరద నీటిని దాటి వెళ్తుండటంతో వారు కూడా వెళ్లాలని భావించారు.

Read Also: Medchal: ఘోర ప్రమాదం.. రైలు ఢీకొని తండ్రి, ఇద్దరు కూతుళ్లు మృతి..

కానీ వాగు ఉధృతి అధిక వేగంతో ప్రవహిస్తుండటంతో కారు నీటిలో కొట్టుకుపొయింది. అది చూసిన స్థానికులు జేసీబీ సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ఆ కారులో ప్రయాణిస్తున్న దీపక్‌ను మాత్రే బయటకు తీయగలిగారు. మిగతా వాళ్లను రక్షించలేకపోయారు. అయితే.. కారులో కొట్టుకుపోయిన వారిలో తొమ్మిది మంది మృతదేహాలను పోలీసులు గుర్తించారు. ఇంకా ఇద్దరి ఆచూకీ లభించలేదు. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. సీఎం సుఖు ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. “జెజో (హిమాచల్-పంజాబ్ సరిహద్దు) సమీపంలో వరద ప్రవాహం కారణంగా ఉనా జిల్లాలోని డెహ్లాన్ గ్రామానికి చెందిన సుమారు 11 మంది ప్రమాదానికి గురయ్యారు. నేను స్థానిక పరిపాలనతో సంప్రదింపులు జరుపుతున్నాను. సహాయ మరియు సహాయక చర్యలు బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సాయం అందించాలని, ఈ కష్టకాలంలో చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలి” అని తెలిపారు.