Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్‌లో ఘరానా మహిళల విషయం వెలుగులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ పథకానికి సంబంధించిన డబ్బులు తీసుకుని కొంత మంది వివాహిత మహిళలు తమ లవర్‌లతో ఉడాయించారు. మహరాజ్ గంజ్ జిల్లాలో ప్రధాని మంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి మొదటి విడత పొందిన తర్వాత 11 మంది వివాహితలు ప్రేమికులతో పారిపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ప్రభుత్వ పథకం పేద, మధ్యతరగతి కుటుంబాలకు శాశ్వత నివాసాన్ని నిర్మించుకునేందుకు ఆర్థిక సాయాన్ని అందిస్తోంది.
ఈ పథకం మొదటి విడత రూ.40,000 అందిన తర్వాత సంజయ్ అనే వ్యక్తి తన భార్య సునియా కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహరం బయటకు వచ్చింది. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన డబ్బును తీసుకుని సునియా గుర్తుతెలియని వ్యక్తితో పారిపోయిందని బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ ప్రాథమిక విచారణలో తేలింది. మహారాజ్ గంజ్ జిల్లాలో మొత్తం 2350 మంది ఈ పథకం కింద డబ్బులు అందుకున్నారు.
Read Also: Kathua Ambush: కథువా ఉగ్రదాడికి ప్రతీకారం తప్పుడు.. పాక్‌కి భారత్ వార్నింగ్..
ఈ ఘటన తర్వాత ఇలాంటివే మొత్తం 10 కేసులు వెలుగులోకి వచ్చాయి. అక్కడ కూడా భర్తలు తమ భార్యలు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ అనునమ్ ఝా మాట్లాడుతూ..‘‘ధాన మంత్రి ఆవాస్ యోజన మొదటి విడతను ఇళ్ళ నిర్మాణానికి ఉపయోగించని 11 మంది మహిళలు దుర్వినియోగం చేసినట్లు దృష్టికి వచ్చింది. లబ్ధిదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖను ఆదేశించాం, నిధులను రికవరీ చేయాలని సూచించాం’’ అని అన్నారు. సునియా కేసులో మిగిలిన రెండు విడతల డబ్బుల్ని తన కుమారుడు సంజయ్ ఖాతాలకు బదిలీ చేయాలని ఆయన తండ్రి అధికారుల్ని వేడుకున్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లో ఇలా జరగడం ఇదే తొలిసారి కాడు. గతంలో బారాబంకి జిల్లాకు చెందిన నలుగురు మహిళలు పథకంలో భాగంగా ప్రభుత్వం అందించిన రూ. 50,000 తీసుకుని తమ ప్రియులతో ఉడాయించారు.