73 వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సిద్దం అవుతున్నది. ఈనెల 29 వ తేదీన బీటింగ్ రీట్రీట్‌తో గణతంత్ర దినోత్సవ వేడుకలు ముగుస్తాయి. అయితే, ఈసారి బీటింగ్ రీట్రీట్ వేడుకల కోసం ప్రత్యేకంగా డ్రోన్ లు ఆకట్టుకోబోతున్నాయి. సుమారు వెయ్యి డ్రోన్‌లు ఈ వేడుకలలో పాల్గొంటున్నాయి. వీటికి ప్రత్యేకంగా అమర్చిన లేజర్ లైటింగ్ ద్వారా లేజర్ షోను నిర్వహించనున్నారు. దేశంలో తొలిసారిగా పూర్తి స్వదేశీ టెక్నాలజీతో డ్రోన్ సహాయంతో ఇలా లేజర్‌షోను నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు అమెరికా, రష్యాలు మాత్రమే ఇలా డ్రోన్‌ల సహాయంతో లేజర్ షోలను నిర్వహించారు. ఇప్పుడు భారత్ ఆ దేశాల సరసన చేరింది. ఐఐటి ఢిల్లీకి చెందిన బోట్‌ల్యాబ్ డైనమిక్స్ ఈ షోను నిర్వహిస్తున్నది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
Read: అతని వయస్సు 66, సంతానం 129 మంది…
