Food poisoning: పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు బుర్ద్వాన్ లోని ఒక ప్రైవేట్ రెసిడెన్షియల్ మదర్సాలో దాదాపుగా 100 మంది విద్యార్థులు శనివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా వీరంతా ఆస్పత్రి పాలయ్యారు. ఈ సంఘటన అన్స్‌గ్రామ్ లోని పిచ్‌కురి నవాబియా మదర్సాలో జరిగింది. శనివారం ఉదయం దాదాపు 7-8 మంది విద్యార్థులు కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడ్డాడు. ఆ తర్వాత గంట గంటకు బాధిత విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరిగింది.
Read Also: Bihar Elections: బీహార్ ఎన్నికల అధ్యయనానికి విదేశీ దౌత్యవేత్తలు..
ముందుగా విద్యార్థుల్ని గుస్కర ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. తదుపరి చికిత్స కోసం బుర్ద్వాన్ మెడికల్ కాలేజీకి తరలించారు. అనారోగ్యంతో బాధపడుతున్న 100 మంది విద్యార్థుల్లో 30 మంది 12 ఏళ్ల కన్నా తక్కువ వయసు వారే ఉన్నారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై జిల్లా ఆహారశాఖ దర్యాప్తు ప్రారంభించింది. మదర్సా అధ్యక్షుడు షేక్ అస్రఫ్ అలీ మాట్లాడుతూ.. శుక్రవార రాత్రి విద్యార్థులు రైస్, సోయా బీన్స్, బంగాళదుంప కూర తిన్నారని, ఇది వారికి సాధారణ భోజనం అని చెప్పారు. ఈ మదర్సాలో మొత్తం 250 మంది రెసిడెన్షియల్ విద్యార్థులు ఉన్నారు. పరీక్షల కోసం ఆహార నమూనాలనున సేకరించారు.
