NTV Telugu Site icon

Gujarat: దారుణం.. కోతి దాడిలో పదేళ్ల చిన్నారి మృతి

Monkey Attack

Monkey Attack

Monkey Attack on Boy: గుజరాత్‌లో దారుణం జరిగింది. కోతి దాడిలో పదేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన సోమవారం సాయంత్రం గాంధీనగర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం.. దేహగామ్ తాలూకాలోని సల్కి గ్రామంలోని ఓ దేవాలయం సమీపంలో దీపక్ ఠాకోర్ (10) అనే చిన్నారి సోమవారం సాయంత్రం స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నాడు. అదే సమయంలో ఓ కోతి అతడిపై దాడి చేసింది. కోతి అటాక్‌తో చిన్నారి పొట్ట నుంచి పేగులు బయటకు వచ్చాయి.

Also Read: Varun Lavanya Pics: పెళ్లి అనంతరం లావణ్య పిక్స్ చుశారా?.. పోలా అదిరిపోలా!

దీంతో చిన్నారిని అస్పత్రికి తరలించగా బాలుడు అప్పటికే మరణించిన వైద్యులు వెల్లడించారు. కాగా ఈ గ్రామంలో కోతులు అధిక సంఖ్యలో ఉన్నాయని.. అవి తరచూ స్థానికులపై దాడికి పాల్పడుతున్నట్టు గ్రామస్తులు వాపోతున్నారు. ఈ వారంలో ఇది నాలుగోవ ఘటన అని, ఇంతకు ముందు ముగ్గిరిపై కోతులు దాడి చేశాయని ఆటవి శాఖ అధికారులు తెలిపారు. ఈ కోతుల గుంపు చాలా పెద్దదని, వాటిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇందుకోసం గ్రామంలో పలు ప్రాంతాల్లో బోనులు ఏర్పాటు చేశామని సదరు ఫారెస్ట్ ఆఫీసర్ తెలిపారు.

Also Read: TDP-Janasena: నేటి నుంచి టీడీపీ – జనసేన ఆత్మీయ సమావేశాలు..

Show comments