Site icon NTV Telugu

Kerala political Murders: యూత్ కాంగ్రెస్ కార్యకర్తల హత్య.. 10 మందికి జీవిత ఖైదు..

K

K

Kerala political Murders: ఐదేళ్ల క్రితం కేరళలో జరిగిన రాజకీయ హత్యలు సంచలనంగా మారాయి. అయితే, ఈ కేసులో నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు డబుల్ యావజ్జీవ శిక్షని విధించింది. 2019లో సీపీఎం-కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణల్లో ఇద్దరు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలైన శరత్‌లాల్‌ పీకే (24), కృపేశ్‌ (19)ల హత్య జరిగింది. ఈ కేసులో 10 మందిని దోషులుగా నిర్ధారించిన ఎర్నాకులంలోని సీబీఐ న్యాయస్థానం శుక్రవారం డబుల్ జీవిత ఖైదులు విధించింది.

నేరానికి సహకరించినందుకు మాజీ ఎమ్మెల్యే కేవీ కున్హిరామన్‌తో సహా నలుగురు సీపీఎం నాయకులకు కోర్టు 5 ఏల్ల కఠిన కారాగార శిక్షను విధించింది. ఫిబ్రవిర 17, 2019న జరిగిన ఈ హత్యలు రాజకీయ ప్రేరేపితమైనవి. బాధితులు ఎచ్చిలదుక్కం రోడ్డులో బైక్‌పై వెళ్తుండగా మెరుపుదాడి చేసి నరికి చంపారు.

Read Also: HMPV Virus: చైనాలో విస్తరిస్తున్న వైరస్ కారణంగా మనం దేనికి భయపడాలి.. లాక్‌డౌన్‌ తప్పదా..?

ఈ హత్యలో 10 మంది నిందితులను హత్య, కుట్ర, చట్టవ్యతిరేకమైన సమావేశాలతో పాటు ఇతర అభియోగాల్లో దోషిులుగా నిర్ధారించింది కోర్టు. డబుల్ జీవిత ఖైదులతో పాటు టీ రంజిత్, ఏ సురేంద్రన్ సాక్ష్యాలను నాశనం చేసినందుకు, నిందితులను రక్షించినందుకు దోషులుగా నిర్ధారించి, ఒక్కొక్కరికి రూ. 2 లక్షల జరిమానా విధించారు. నిందితులను పోలీస్ కస్టడీ నునంచి బలవంతంగా విడిపించినందుకు గానూ నలుగురు సీపీఎం నాయకులు కే మణికందన్, రాఘవన్ వెలుతోలి, కెవి భాస్కరన్‌లకు ఐదేళ్ల జైలుశిక్ష మరియు రూ. 10,000 జరిమానా విధించారు. తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో మరో 10 మందిని నిర్దోషులుగా కోర్టు విడుదల చేసింది.

ఈ కేసుని ముందుగా బేకల్ పోలీసులు విచారించారు, తర్వాత క్రైమ్ బ్రాంచ్‌తో విచారణ జరిగింది. బాధిత కుటుంబాల విజ్ఞప్తి మేరకు కేరళ హైకోర్టు, సీబీఐ విచారణకు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి దీనిపై వ్యతిరేకత వచ్చింది. డిసెంబర్ 2021లో దాఖలు చేసిన సీబీఐ ఛార్జ్ షీట్ ప్రకారం.. 20 నెలల పాటు విచారణ జరిగింది. ప్రాసిక్యూషన్ 154 మంది సాక్షులను, 495 పత్రాలను సమర్పించింది. 6 ఏళ్లు సాగిన న్యాయపోరాటంలో న్యాయమూర్తి శేషాద్రినాథన్ తీర్పుని వెలువరించారు. అయితే, నేర క్రూరత్వాన్ని పరిగణలోకి తీసుకుని నిందితులకు మరణశిక్ష విధించాలని సీబీఐ కోరింది. అయితే, వారంతా అలవాటైన నేరస్తులు కాదని, యావజ్జీవ శిక్ష విధించడం జరిగింది.

Exit mobile version