NTV Telugu Site icon

Road Accident: సీఎం ర్యాలీకి వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.

Untitled 12

Untitled 12

E Shinde Dussehra Rally: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే దసరా ర్యాలీ నిరవహించారు. ఈ నేపథ్యంలో ఆయన ర్యాలీకి హాజరు అయిన ప్రజలు తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురైయ్యారు.. వివరాలలోకి వెళ్తే.. ఏక్‌నాథ్ షిండే దసరా ర్యాలీ కి వెళ్లి ప్రజలతో తిరిగి వస్తున్న ప్రైవేట్ బస్సు థానే జిల్లాలో ప్రమాదానికి గురైంది. పోలీసుల సమాచారం ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో ముంబై-నాసిక్ హైవేపై కొలంబే వంతెనపై ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సును వెనుక నుంచి ట్రక్కు ఢీకొట్టడంతో బస్సు డివైడర్‌పైకి దూసుకెళ్లింది. అదే సమయంలో మరో బస్సు లారీని వెనుక నుంచి ఢీకొట్టింది.

Read also:Ambati Rambabu: పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన మంత్రి అంబటి.. ఇంకా దానిపై కేంద్రం నిర్ణయం తీసుకోలేదు..!

కాగా ఆ సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 10 మంది ఈ ప్రమాదంలో గాయపడ్డారు. కాగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే గాయపడిన వారిలో ఇద్దరు ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. కాగా రోడ్డుపైన ప్రమాదానికి గురైన బస్సును తొలిగించేందుకు క్రేన్లను ఉపయోగించాల్సి వచ్చింది. కాగా ఈ బస్సు నాసిక్ జిల్లా లోని సిలోడ్‌కు వెళ్తోందని.. ఆసమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారని థానే రూరల్ పోలీస్ కంట్రోల్ రూమ్ అధికారి తెలిపారు. కాగా అందరు కూడా షిండే దసరా ర్యాలీకి వెళ్లి వస్తున్న ప్రజలే అని పేర్కొన్నారు. అయితే ఈ ప్రమాదం లో ప్రయాణికులు గాయపడ్డారని.. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని వెల్లడించారు.