NTV Telugu Site icon

Bomb threats: గుజరాత్ రాజ్‌కోట్ హోటళ్లకు వరస బాంబు బెదిరింపులు..

Gujrat

Gujrat

Bomb threats: గుజరాత్ రాజ్‌కోట్‌ నగరంలోని పలు హోటళ్లకు వరసగా బాంబు బెదిరింపులు వచ్చాయి. నగరంలోని ఫైవ్ స్టార్ హోటళ్ల సహా 10 హోటల్లకు శనివారం ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. బెదిరింపులు ఎదుర్కొన్న హోటళ్లలో ఇంపీరియల్ ప్యాలెస్, సయాజీ హోటల్, సీజన్స్ హోటల్, గ్రాండ్ రీజెన్సీ వంటి ప్రసిద్ధ హోటళ్లు ఉన్నాయి. దీపావళి సందర్భంగా నగరం అంతా కోలాహలంగా ఉన్న సమయంలో ఈ బెదిరింపులు స్థానిక ప్రజల్లో ఆందోళన పెంచాయి.

Read Also: Raashi Khanna: పెళ్లిపై రాశి ఖన్నా కీలక వ్యాఖ్యలు

ఈ బెదిరింపులపై రాజ్‌కోట్ పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. ఎక్కడ నుంచి వచ్చాయనే దానిపై ఆరా తీస్తున్నారు. బెదిరింపులు ఎదుర్కొన్న హోటళ్లలో తనిఖీలు ప్రారంభించారు. “నేను మీ హోటల్‌లోని ప్రతి ప్రదేశంలో బాంబులు ఉంచాను. కొన్ని గంటల్లో బాంబులు పేల్తాయి. ఈ రోజు చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతారు. త్వరపడి హోటల్‌ని ఖాళీ చేయండి. ఇప్పుడే ఖాళీ చేయండి” అని హోటళ్లకు వచ్చిన ఇమెయిల్స్ వచ్చాయి.

ఇటీవల దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపులు ఎక్కువ అయ్యాయి. గత 10 రోజుల్లో 250కి పైగా భారతీయ విమానాలు బెదిరింపుల్ని ఎదుర్కొన్నాయి. ప్రతీ రోజు ఎయిర్ ఇండియా, ఇండిగో, విస్తారా, స్పైస్ జెట్, ఆకాశ ఎయిర్ లైనర్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపులపై కేంద్రం సీరియస్‌గా దృష్టి సారించింది. ఎక్స్ వేదికగా వచ్చిన బెదిరింపులపై కేంద్రం ఆ సంస్థపై సీరియస్ అయింది. ఇలా బెదిరింపులకు పాల్పడే వారిని ‘నోఫ్లై’ జాబితాలో చేర్చాలని కేంద్రం యోచిస్తోంది.