US-Canada: కెనడా నుంచి అమెరికాకు భారతీయుల అక్రమ వలస.. 10 రెట్లు పెరిగినట్లు నివేదిక..
- కెనడా నుంచి అమెరికాకు పెరిగిన భారతీయుల అక్రమ వలస..
- 10 రెట్లు పెరిగినట్లు చెబుతున్న నివేదిక..
- రాజకీయ అణిచివేత, ఖలిస్తానీ అంశాలు వలసలకు కారణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Canada: కెనడా నుంచి అమెరికాకు భారతీయుల అక్రమ వలసలు పెరిగినట్లు ఓ నివేదిక వెల్లడించింది. అక్రమంగా సరిహద్దు దాటడం 10 రెట్లు పెరిగినట్లు చెబుతోంది. యూఎస్ సరిహద్దు గస్తీ డేటా ఈ వివరాలను చెబుతోంది. భారతదేశం నుంచి అక్రమ వలసలు ఉన్నప్పటికీ, ఇటీవల కాలంలో ఇది ఎక్కువగా పెరిగినట్లు అమెరికన్ వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది. యూఎస్ సరిహద్దు డేటా ప్రకారం.. సెప్టెంబర్ 30 వరకు ఈ ఏడాదిలో యూఎస్-కెనడా సరిహద్దుల్లో 14,000 మందికి పైగా భారతీయులు అరెస్టయ్యారు. ఇది కేవలం రెండేళ్లలో 10 శాతం పెరిగింది. అమెరికా-కెనడా సరిహద్దుల్లో జరిగిన మొత్తం అరెస్టుల్లో 60 శాతం భారత సంతతి వ్యక్తులే ఉన్నారు.
Also Read
- West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
- LPG Demand Drop: అమాంతం పడిపోయిన LPG వినియోగం.. పెట్రోల్, డీజిల్ రివర్స్.. !
- DK.Shivakumar: ముఖ్యమంత్రిగా యువతపై డీకే.శివకుమార్ వరాల జల్లు.. విద్యార్థులందరికీ ఫ్రీ బస్ పాస్లు
- Sourav Ganguly: దాదాకు షాక్.. గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం
ప్యూ రీసెర్చ్ సెంటర్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. 2022 నాటికి అమెరికాలో అక్రమంగా దాదాపుగా 7,25,000 మంది భారతీయులు నివిస్తున్నట్లు అంచనా. అయితే, కెనడా నుంచి అమెరికాకు పెరిగిన వలసలకు కారణాలను కూడా రిపోర్ట్ చర్చింది. రాజకీయ అణిచివేత, ఖలిస్తానీ తీవ్రవాదం పెరగడం వంటి అంశాలు దోహదం చేస్తున్నట్లు తెలుస్తోంది. యూఎస్ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ, వీసాలు, పర్మిట్ల కోసం ఎక్కువ కాలం వేచి ఉండటం కూడా అక్రమ వలసల్ని పెంచినట్లు తెలుస్తోంది.
కొన్ని సందర్భాల్లో ఈ వలసలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. 2022లో జనవరిలో తీవ్రమైన చలిలో జగదీష్ పటేల్, అతడి భార్య వైశాలిబెన్, ఇద్దరు చిన్న పిల్లలు ఇలాగే యూఎస్ కెనడా సరిహద్దు దాటాలని ప్రయత్నించారు. అయితే, గడ్డకట్టే చలిలో చిక్కుకుని నలుగురు మరణించడం ప్రపంచ స్థాయి వార్తగా నిలిచింది. మెరుగైన జీవితం కోసం పాఠశాల ఉపాధ్యాయుడు జగదీష్ అతడి కుటుంబం అమెరికా పయణమైంది. -36 డిగ్రీ సెల్సియస్ చలిలో బార్డర్ దాటేందుకు యత్నించి మరణించారు. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా గెలవడంతో సరిహద్దుల్లో వలసల్ని అడ్డుకునేందుకు ‘‘బోర్డర్ సీజర్’’గా వలసల్ని వ్యతిరేకించే టామ్ హోమన్‌ని నియమించారు.
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!