NTV Telugu Site icon

Karnataka Road Accident: కర్ణాటకలో ట్రక్కు బోల్తా పడి 10 మంది మృతి.. 15 మందికి గాయాలు!

Karnataka

Karnataka

Karnataka Road Accident: కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సుమారు 10 మంది మరణించగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈరోజు (జనవరి 22) తెల్లవారుజామున కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉత్తర కన్నడ జిల్లాలోని అరబైల్ ఘాట్​ లోని కాగేరి పెట్రోల్ బంక్ సమీపంలో NH-63పై కూరగాయలు, పండ్లతో వెళ్తున్న ట్రక్కు బోల్తా పడింది. అయితే, ఈ ప్రమాద సమయంలో ట్రక్కులో 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. కాగా, ఇప్పటి వరకు 10 మంది మృతి చెందినట్లు పోలీసులు ధృవీకరించగా.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ట్రక్కు హవేరి నుంచి కుంటకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే, ప్రమాదంలో గాయపడిన 15 మందిని స్థానిక ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఇక, ఈ రోడ్డు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.