టాలీవుడ్‌లో సరికొత్త ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన యంగ్ సూపర్ హీరో తేజ సజ్జ మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు, బాక్సాఫీస్ వద్ద వరుస బ్లాక్‌బస్టర్లతో సంచలనం సృష్టించిన ఈ యువ హీరో, ఇప్పుడు తన కెరీర్‌లో ఫస్ట్ హిట్ ఇచ్చిన జోనర్‌లోకి మళ్ళీ అడుగుపెడుతున్నారు. అవును.. మీరు ఊహించింది నిజమే! తెలుగులో మొదటి జాంబీ సినిమాగా రికార్డు సృష్టించిన ‘జాంబీ రెడ్డి’కి సీక్వెల్ ‘జాంబీ రెడ్డి 2’ ఇప్పుడు పట్టాలెక్కడానికి సిద్ధమైంది, ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని తెలుస్తోంది. జాంబీ రెడ్డి దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సీక్వెల్‌కు కథను అందించారు, మొదటి భాగాన్ని ప్రశాంత్ వర్మ స్వయంగా డైరెక్ట్ చేశారు, కానీ ఈ రెండో భాగాన్ని ఒక ‘సర్ప్రైజింగ్ డైరెక్టర్’ హ్యాండిల్ చేయబోతున్నారు. ఆ డైరెక్టర్ ఎవరనే సస్పెన్స్‌ను మేకర్స్ ప్రస్తుతానికి సీక్రెట్‌గా ఉంచారు. ఆ పేరు బయటకు వస్తే టాలీవుడ్‌లో అది పెద్ద సెన్సేషన్ అవుతుందని టాక్.
Also Read:Virosh Wedding: కోడలు రష్మికకు..అత్తగారు షాకింగ్ గిఫ్ట్
ఈసారి జాంబీల హంగామా మామూలుగా ఉండబోవట్లేదు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టి.జి. విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. మొదటి భాగం రాయలసీమ నేపథ్యంలో సాగగా, ఈ రెండో భాగం అంతకు మించి ‘వైల్డ్’గా, భారీ స్థాయిలో ఉండబోతోందని సమాచారం. మొదటి భాగం కంటే విజువల్ ఎఫెక్ట్స్ (VFX) మరియు మేకప్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జాంబీలతో పోరాడే సన్నివేశాలు ఈసారి మరింత డెడ్లీగా ఉంటాయట. పాన్ ఇండియా ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. ‘హను-మాన్’ విజయంతో నేషనల్ లెవల్‌లో గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జ, ‘మిరాయ్’తో మళ్ళీ సత్తా చాటాడు. ఇక మొత్తంగా జాంబీ జోనర్‌లో తెలుగులో మరో హిట్టు కొట్టేందుకు తేజ అండ్ టీమ్ సిద్ధమైపోయింది.
