ఆర్ ఆర్ ఆర్ సినిమాతో రామ్ చరణ్ క్రేజ్ గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’. RC 15′ అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ, రామ్ చరణ్ పుట్టిన రోజున ‘ఫస్ట్ లుక్ పోస్టర్’తో పాటు ‘గేమ్ చేంజర్’గా టైటిల్ అనౌన్స్ అయ్యింది. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాలు అనే ట్రెండ్ లేక ముందే, విజువల్ ఎఫెక్ట్స్ గురించి ఎవరికీ ఎక్కువగా తెలియక ముందే రీజనల్ సినిమాల హద్దుల్ని చెరిపేసే సినిమాలని చేసాడు శంకర్. కమర్షియల్ సినిమాలకి సోషల్ కాజ్ అద్దడం శంకర్ కి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. అందుకే శంకర్ తో రామ్ చరణ్ సినిమా చేస్తున్నాడు అనగానే… అనౌన్స్మెంట్ తోనే పాన్ ఇండియా బజ్ జనరేట్ అయ్యింది. ఈ బజ్ ని మరింత పెంచుతూ చరణ్ ఓల్డ్ లుక్ లీక్ అవ్వడం, యంగ్ లుక్ లో స్మార్ట్ గా ఉండడం, మధ్యలో ఆఫీసర్ గా సూటు బూటు వేసుకొని చరణ్ కనిపించడంతో… గేమ్ చేంజర్ సినిమా శంకర్ మీటర్ లో ఉంటూ చరణ్ ని ఎలివేట్ చేసేలా ఉంటుందని అందరు నమ్మారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతూ అప్పటికప్పుడు అప్డేట్స్ బయటకి వచ్చేవి.
ఇలాంటి సమయంలో శంకర్, ఇండియన్ 2 సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టడంతో గేమ్ చేంజర్ సినిమాకి సమస్యలు మొదలయ్యాయి. ఊహించిన దానికన్నా గేమ్ చేంజర్ డిలే అవ్వడం మొదలయ్యింది. సంక్రాంతి నుంచి తప్పిస్తూ గేమ్ చేంజర్ సినిమాని సమ్మర్ కి తీసుకోని వెళ్లారు. లేటెస్ట్ గా గేమ్ చేంజర్ సినిమా సమ్మర్ నుంచి కూడా వెనక్కి వెళ్లినట్లు తెలుస్తోంది. పోస్ట్ సమ్మర్ లోనే గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమా టీజర్ ని గ్రాండ్ స్కేల్ లో ఒక భారీ ఈవెంట్ చేసి మరీ ఆగస్ట్ 15న విడుదల చేస్తారని మెగా ఫ్యాన్స్ అంతా భావించారు. ఇండిపెండెన్స్ డే కోసమే కాదు గతంలో రిపబ్లిక్ డే రోజున కూడా మెగా ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ అప్డేట్ కోసం చాలానే వెయిట్ చేసారు. సంక్రాంతి, రిపబ్లిక్ డే, శివరాత్రి, రామ్ చరణ్ బర్త్ డే, ఉగాది, లేటెస్ట్ గా ఇండిపెండెన్స్ డే ఇలా అకేషన్స్ అన్నీ అయిపోతున్నాయి కానీ గేమ్ చేంజర్ సినిమా నుంచి మాత్రం అప్డేట్ బయటకి రావట్లేదు. కనీసం వినాయకచవితి, దసరా పండగలకైనా అప్డేట్ ఇస్తారా లేక సైలెంట్ గా ఉంటారా అనేది చూడాలి.