NTV Telugu Site icon

RRR: గుడ్ న్యూస్ చెప్పిన జీ5.. ఉచితంగా అందుబాటులోకి!

Rrr Free On Zee5

Rrr Free On Zee5

వరల్డ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టించిన ఆర్ఆర్ఆర్ సినిమా.. ఇప్పుడు డిజిటల్ వరల్డ్‌లోనూ రికార్డుల పర్వం కొనసాగించేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ జీ5 ఈ చిత్రాన్ని 20వ తేదీ నుంచి దక్షిణాది భాషల్లో స్ట్రీమ్ చేయనుంది. తొలుత జీ5 సంస్థ పే-పర్-వ్యూ మోడ్‌లో ఈ సినిమాని తీసుకొస్తామని తెలిపింది. ఈ సినిమాకి ఉన్న క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలని, జీ5 ఆ విధానాన్ని అమలుపరచాలనుకుంది.

కానీ, ఆడియన్స్ నుంచి భారీఎత్తున తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. పే-పర్-వ్యూ విధానాన్ని ఎందుకు తీసుకొస్తున్నారని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. జీ5 సబ్‌స్క్రైబర్స్‌ని ఈ సినిమాని ఉచితంగా అందించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రజల అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకొని.. జీ5 సంస్థ వెనక్కు తగ్గింది. పే-పర్-వ్యూ విధానాన్ని తొలగించి.. సబ్‌స్క్రిప్షన్ ఉన్నవాళ్ళకి ఆర్ఆర్ఆర్‌ని ఉచితంగా చూసే అవకాశం కల్పిస్తోంది. ఈరోజు అర్ధరాత్రి నుంచే వీక్షకులకు ఈ సినిమా అందుబాటులో ఉంటుంది. జీ5 తీసుకున్న తాజా నిర్ణయంతో, జనాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరో గుడ్ న్యూస్ ఏమిటంటే.. రూ. 699 చెల్లించి ‘RRR ప్లస్ జీ5’ కాంబో ప్యాక్‌ని కొనుగోలు చేసిన వినియోగదారులందరికీ.. మూడు నెలలు అదనపు కాలపరిమితి చెల్లుబాటు అయ్యే విధంగా అందిచడం జరుగుతుందని జీ5 సంస్థ వెల్లడించింది. మొత్తానికి.. ఈ సంవత్సరంలో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఆర్ఆర్ఆర్.. జీ5 లో స్ట్రీమింగ్ అవుతుండడంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వెండితెరపై వండర్స్ క్రియేట్ చేసిన ఈ చిత్రం.. డిజిటల్ వరల్డ్‌లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Show comments