Z5: బాలయ్య, వెంకీ, అఖిల్, చైతూలతో ‘జీ5’ సంచలనం..కళ్లు చెదిరే బ్లాక్ బస్టర్ లైనప్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు ప్రేక్షకులకు అసలైన బ్లాక్‌బస్టర్ ట్రీట్ ఇచ్చేందుకు ప్రముఖ ఓటీటీ సంస్థ ‘జీ5’ (ZEE5) సిద్ధమైంది. స్టార్ హీరోల భారీ బడ్జెట్ సినిమాలు, ఎంగేజ్ చేసే వెబ్ సిరీస్‌లు, నెటివిటీతో కూడిన ఒరిజినల్ కంటెంట్‌తో మునుపెన్నడూ లేని స్థాయిలో అద్భుతమైన లైనప్‌ను అధికారికంగా ప్రకటించింది. టాలీవుడ్‌లోని అగ్ర నిర్మాణ సంస్థలైన వైజయంతీ మూవీస్, సుకుమార్ రైటింగ్స్, ఎస్వీసీసీ, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్, షైన్ స్క్రీన్స్ వంటి బ్యానర్లతో జీ5 వ్యూహాత్మక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ లైనప్‌లో ప్రేక్షకులను ఉర్రూతలూగించే క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహం నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ నటిస్తున్న మాస్ యాక్షన్ చిత్రం ‘ఎన్బీకే 111’. అనిల్ రావిపూడి డైరెక్షన్లో విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్‌గా వస్తున్న ‘జనవరి 12 విడుదల’. కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో యువ సామ్రాట్ నాగ చైతన్య, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న ‘వృషకర్మ’.‘లెనిన్’, ప్రదీప్ మద్దాలి తెరకెక్కిస్తున్న అల్లరి నరేష్ చిత్రం **‘కనక దుర్గ’లతో పాటు ‘డిమాంటీ కాలనీ 2’, ‘జననాయకుడు’, ‘వీరప్పన్ 2’, ‘హాయ్’, ‘ఏ క్వీన్’ లాంటి డబ్బింగ్ సినిమాలు కూడా జీ5లో కొన్ని సందడి చేస్తున్నాయి, కొన్ని చేయనున్నాయి.
సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌ల విభాగంలోనూ జీ5 సత్తా చాటుతోంది. నివేదా థామస్ లీడ్ రోల్లో వస్తున్న ‘శ్రీమతి’, శివాజీ రాజా, భరత్ నివాస్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ‘పంచనామా’ సిరీస్‌లు ఆకట్టుకోనున్నాయి. అలాగే సీనియర్ నటుడు జగపతి బాబు హోస్ట్‌గా పాపులర్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా 2’తో మరోసారి ప్రేక్షకులను పలకరించనున్నారు. మరో అడుగు ముందుకేసి ఏఐ (AI) ఆధారిత స్టోరీటెల్లింగ్‌తో ‘విక్రమ్ బేతాళ్’, ‘గరుడ’, ‘చంద్రకాంత’, ‘రామ్ ఆంజనేయ యుద్ధ్’, ‘తిరుపతి బాలాజీ’ వంటి ఫాంటసీ, పౌరాణిక కథలను అందించబోతోంది. వీటితో పాటు కిడ్స్ కోసం ప్రత్యేక షోలు, స్పోర్ట్స్ లవర్స్ కోసం ఫుట్‌బాల్ (ఫిఫా, బుండెస్లీగా), క్రికెట్ (ఐఎల్టీ20) లైవ్ ఈవెంట్స్‌ను సైతం స్ట్రీమింగ్ చేయనుంది. దక్షిణాది ప్రేక్షకుల అభిరుచుల గురించి జీ5 (తెలుగు, తమిళ్, మలయాళం) బిజినెస్ హెడ్ లాయిడ్ సి. జేవియర్ మాట్లాడుతూ.. తెలుగు ఆడియెన్స్ ఎప్పుడూ కొత్తదనాన్ని, తమ మనసుకు హత్తుకునే సహజమైన కథలను ఆదరిస్తారని తెలిపారు. అగ్రశ్రేణి క్రియేటర్స్, నిర్మాణ సంస్థలతో ఉన్న భాగస్వామ్యంతో ప్రేక్షకుల పల్స్ పట్టుకున్నామని, ఈ సరికొత్త లైనప్ ద్వారా అద్భుతమైన, ధైర్యవంతమైన కంటెంట్‌ను అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
తాజావార్తలు
-
Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
-
Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!