ATM Web Series :ఆసక్తికరంగా ఏటీఎం వెబ్‌సీరీస్ ట్రైలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు ఓటీటీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఉస్తాద్ భగత్‌సింగ్ డైరక్టర్ హరీష్ శంకర్ రాసిన కథతో తెరకెక్కింది ఏటీఎం వెబ్‌సీరీస్. బిగ్‌బాస్ తెలుగు 5 టైటిల్ విన్నర్ వీజే సన్నీ కూడా ఈ సీరీస్‌తో ఓటీటీలోకి ప్రవేశిస్తున్నారు. ఏటీఎం ట్రైలర్‌ని ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ఇవాళ ఆవిష్కరించారు.
సి చంద్రమోహన్ దర్శకత్వం వహిస్తున్న వెబ్‌సీరీస్ ఇది. డీజే, గబ్బర్‌సింగ్ చిత్రాల ఫేమ్ హరీష్‌శంకర్ స్టార్ షో రన్నర్. జీ5 ఈ వెబ్‌సీరీస్‌ని తీసుకుంది. దోపిడీ నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్ ఇది. జనవరి 20 నుంచి జీ5లో ప్రసారమవుతుంది.
Also Read
- Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! 'జై హనుమాన్' అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
- Akshara Haasan: "టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా".. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
- Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
- Varalaxmi Sarathkumar: "నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా"
గద్దలకొండ గణేష్ డైరక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ “దోపిడీ జోనర్లో రాసే కథల్లో చాలా పొటెన్షియల్ ఉంటుంది. సెట్టింగ్ రియలిస్టిక్‌గా ఉంటుంది. ఈ సీరీస్‌లో దొంగలు రొటీన్‌గా ఉండరు. వాళ్లల్లో ఓ ప్రత్యేకత ఉంటుంది. వీజే సన్నీ కీ రోల్ చేశారు. స్లమ్ లైఫ్ మీద అతనికున్న ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది. నవాబ్ తరహా జీవితాన్ని కోరుకున్న అతను ఏం చేశాడనేది ఆసక్తికరం. సీరీస్ గురించి ఇంతకు మించి ఎక్కువ చెప్పదలచుకోలేదు. పిల్లీ ఎలుకా గేమ్‌లాగా ఉంటుంది. ఓ వైపు నవ్విస్తూనే ఉంటుంది. చాలా కొత్త ప్రయత్నం చేశాం“ అని అన్నారు.
పవర్ ఫుల్ ఫోర్సుల వల్ల కార్నర్ అయిన నలుగురు చిన్న దొంగల రోలర్ కోస్టరే ఈ సీరీస్. ప్రాణాలతో బతికి ఉండాలంటే కొన్ని కోట్ల రూపాయలను దోపిడీ చేయాల్సిన పరిస్థితుల్లోకి నెట్టబడిన వాళ్ల కథే ఇది. సుబ్బరాజు చాలా స్ట్రాంగ్ రోల్ ప్లే చేశారు“ అని నిర్మాత హర్షిత్ రెడ్డి అన్నారు.
- Tags
తాజావార్తలు
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
-
Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!