తెలుగు టెలివిజన్ రంగంలో తిరుగులేని ఛానల్ గా రాణిస్తున్న జీ తెలుగు ప్రారంభించిన సరికొత్త నాన్ ఫిక్షన్ షో సూపర్. సెలబ్రిటీ డ్యాన్స్ రియాలిటీ షోగా ఘనంగా లాంచ్ చేసిన ఈ షో మొదటి మెగా లాంచ్ ఎపిసోడ్ అభిమానులను ఎంతగానో అలరించింది. మరిన్ని అద్భుత ప్రదర్శనలతో రెండో ఎపిసోడ్ సూపర్ జోడీ షోప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రతి ఆదివారం అదిరిపోయే ఎపిసోడ్లతో అలరించేందుకు సిద్ధమవుతున్న సూపర్ జోడీ రెండో ఎపిసోడ్ ఫిబ్రవరి 04న, ఆదివారం రాత్రి 9 గంటలకు మీ జీ తెలుగులో మాత్రమే కనువిందు చేయనుంది.
గత ఆదివారం ప్రసారమైన సూపర్ జోడీ మొదటి ఎపిసోడ్ నవ్వులు, భావోద్వేగాలు, అదిరిపోయే ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించింది. ఫిబ్రవరి 4న రాత్రి 9 గంటలకు ప్రసారం కానున్న రెండో ఎపిసోడ్ జీ తెలుగు ప్రేక్షకులను మరింత ఉర్రూత లూగించనుంది. మొదటి ఎపిసోడ్ లాగే రెండో ఎపిసోడ్ కూడా ప్రతిభ, అందం, వినోదం సమ్మేళనంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఈనెల బ్రిటీ డాన్స్ షో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన బుల్లి తెరపై సంచలనంగా మారింది.
ఎవర్గ్రీన్ యాంకర్ ఉదయ భాను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోకి అందాల తారలు మీనా, మీనా, శ్రీదేవి విజయ్ కుమార్ తో పాటు ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.
వినోద భరితంగా సాగిన మొదటి ఎపిసోడ్ లో నలుగురు డైనమిక్ సెలబ్రిటీ జోడీ మేఘన-మహేష్, శ్రీసత్య-సంకేత్, మున్నా- హర్షల, కరమ్ మరియు డాలీ తమ అద్భుతమైన ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన ఈ జోడీల ఆకట్టుకునే ప్రదర్శనలు సూపర్ జోడీ షో రానున్న ఎపిసోడ్లకి ప్రతీకగా నిలిచాయి.
ఇక, ‘ఆపరేషన్ వాలెంటైన్’ ప్రమోషన్ లో భాగంగా సూపర్ జోడీ గ్రాండ్ లాంచ్కి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ముఖ్య అతిథిగా హాజరై మరింత గ్లామర్ జోడించారు. ఈ ఎపిసోడ్ కొనసాగింపుగా ప్రసారం కానున్న రెండో ఎపిసోడ్లో మరో నాలుగు సెలబ్రిటీ జోడీలైన తనూజ-కృష్ణ, పింకీ-శివ, అంజనా-సంతోష్, దిలీప్-యష్మి ఆకట్టుకునే ప్రదర్శనలతో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ భాగం కానున్న సూపర్ జోడీ రెండో ఎపిసోడ్ని చూసేందుకు మీరూ సిద్ధంకండి!
సూపర్ జోడీ షో లాంచ్ని గ్రాండ్గా ప్లాన్ చేసిన జీ తెలుగు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రచారం చేసింది. ఈ మార్కెటింగ్ ప్రచారంలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో భారీగా హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, ఆటోలు, బస్సులు, బస్ షెల్డర్లపైనా పోస్టర్లతోపాటు సోషల్ మీడియాలోనూ విస్తృతమైన ప్రచారంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. తమ నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న సెలబ్రిటీల అద్భుతమైన ప్రదర్శనలను అందిస్తున్న జీ తెలుగు సూపర్ జోడీని వారం వారం మీరూ తప్పక చూడండి!