రెండు భాగాలుగా జీ తెలుగు కుటుంబం అవార్డుల వేడుక!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2021 కార్యక్రమం రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని జీ తెలుగులో రెండు భాగాలుగా ప్రసారం చేయబోతున్నారు. తొలి భాగాన్ని ఈ నెల 23వ తేదీ, శనివారం సాయత్రం 6.00 గంటలకు, రెండవ భాగాన్ని ఇదే నెల 31వ తేదీ, ఆదివారం సాయంత్రం 6.00 గంటలకు ప్రసారం చేస్తారు. జీ తెలుగు ఛానెల్ లో ప్రసారం అయ్యే సీరియల్స్ లోని నటీనటులంతా రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రతి ఇంటిలోనూ కుటుంబ సభ్యులుగా మారిపోయారు. దాంతో ఆ సీరియల్స్ లో వారి నటనను బేరీజు వేస్తూ అవార్డ్స్ ఇచ్చే కార్యక్రమంలోనూ వీక్షకులు భాగస్వాములుగా మారిపోయారు. అలా ఈ యేడాది ఏ యే సీరియల్స్ కు, అందులో ఏ యే నటీనటులకు అవార్డులు దక్కాయో మరో 24 గంటలలో తెలియబోతోంది.
విశేషం ఏమంటే… మిల్కీ బ్యూటీ తమన్నా, అందాల సుందరి మెహ్రీన్ ఫిర్జాదా, కృతీశెట్టి, సీనియర్ స్టార్ హీరోయిన్ శ్రియా, ఆమె భర్త ఆండ్రీ కొస్చీవ్, నిహారిక కొణిదెల, అలీ, ఆకాశ్ పూరి, నిఖిల్, సుధా చంద్రన్, హెబ్బా పటేల్, సురభి తదితరులు ఈ వేడుకకు అతిథిలుగా హాజరయ్యారు.
Also Read
- Secret Soldiers: 'చైనా' పేరుతో సెన్సార్ బోర్డ్‌లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
- Nehal Vadoliya : ప్రాణాలకు ముప్పు ఉంది.. తమన్నా మాజీ ప్రియుడు విజయ్ వర్మపై నటి సంచలన ఆరోపణలు!
- Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
Read Also : “మా” వివాదం : ఇది శాంపిల్ మాత్రమే… ఆధారాలతో ప్రకాష్ రాజ్ ట్వీట్
శ్యామల, ప్రదీప్ మాచిరాజు, శ్రీముఖి, అఖిల్ సార్థక్ రెండు రోజుల పాటు సాగిన ఈ అవార్డుల కార్యక్రమానికి యాంకర్లుగా వ్యవహరించారు. వీరి కామెడీ టైమింగ్ తో అవార్డుల వేడుకలో నవ్వుల పువ్వులు పూశాయి. భర్తతో కలిసి శ్రియా ఓ అవార్డుల వేడుకకు హాజరు కావడం ఇదే తొలిసారి కాగా, బ్యూటీఫుల్ హీరోయిన్ మెహ్రీన్ యాంకర్ అఖిల్ తో కలిసి ‘ఏమై పోతావే’ పాటకు డాన్స్ చేయడం మరో విశేషం. ఇక ప్రదీప్, శ్రీముఖి, అఖిల్ తో కలిసి తమన్నా ‘ఎఫ్ 3’ థీమ్ స్కిట్ ను చేసి అలరించడం కార్యక్రమంలో మరో హైలైట్.
అకుల్ బాలాజీ ఈ వేడుకలో తన తల్లికి పాదపూజ చేయగా, నటి, నృత్యకారిణి సుధాచంద్రన్ తన తండ్రి గురించి మాట్లాడారు. ఇక జై ధనుష్, కీర్తి జై ధనుష్ తమ పాపను తెలుగు క్లస్టర్ హెడ్ అనురాధ గూడూరు చేతుల మీదుగా ఊయలలో వేయించడం జీ కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అనుబంధానికి నిదర్శనంగా నిలిచింది. ఇలా సినీతారల డాన్సులు, జీ కుటుంబ సభ్యుల పెర్ఫార్మెన్స్ తో ఈ వేడుక మరో లెవెల్ కు చేరుకుంది. సో…. ఈ నెల 23, 31వ తేదీ సాయంత్రాలు జీ తెలుగు వీక్షకులకు పండగే పండగ!
తాజావార్తలు
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
-
Secret Soldiers: ‘చైనా’ పేరుతో సెన్సార్ బోర్డ్‌లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
-
OTR: సిగ్గా.. భయమా.. మొహమాటమా? అంజిరెడ్డి తీరుపై బీజేపీలో హాట్ టాపిక్
-
OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!