NTV Telugu Site icon

NTR 30: సర్ ఇంతకీ ఎప్పుడు వస్తారు?

Ntr 30 Copy

Ntr 30 Copy

ఒకప్పుడు మహేశ్ బాబు సినిమా గురించి అప్డేట్ కోసం ఘట్టమనేని అభిమానులు తెగ ఎదురు చూసే వాళ్లు. ఆ తర్వాత ప్రభాస్ ఫాన్స్ అప్డేట్ కోసం రక్తాలు చిందించే వాళ్లు. ఇప్పుడు ఆ వంతు ఎన్టీఆర్ అభిమానులకి వచ్చింది. ఎన్టీఆర్ ఏమో ఫారిన్ లో ఉన్నాడు, కొరటాల శివ ఏమో హైదరాబాద్ లో ఉన్నాడు. ఈ ఇద్దరూ కలిసి ఎన్టీఆర్ 30 సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనే విషయంలో ఎవరికీ ఎలాంటి క్లారిటీ లేదు. ఈ మూవీ అనౌన్స్ అయినప్పటి నుంచి హ్యాపీ దసరా, హ్యాపీ దీపావళి, మెర్రి క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్, మకర సంక్రాంతి శుభాకాంక్షలు అనే ఫెస్టివల్ విషేస్ పోస్టర్స్ ని తప్ప మేకర్స్ ఇంకో మాట చెప్పట్లేదు. దీంతో నందమూరి అభిమానులు అసలు ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అనే డైలమాలో ఉన్నారు.

Read Also: Veera Simha Reddy: బాలయ్య మాస్ కి తలొంచిన ఓవర్సీస్ బాక్సాఫీస్

నిజానికి మేకర్స్ చెప్పిన దాని ప్రకారం ఎన్టీఆర్ 30 సినిమా ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవ్వాలి. ఫిబ్రవరి నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ అంటే ఈ నెలలో పూజా కార్యక్రమాలు అయినా పూర్తి చేసుకోవాలి. ఎన్టీఆర్ హైదరాబాద్ వస్తే కానీ పూజా కార్యక్రమాలు జరగవు, ఎన్టీఆర్ ఎప్పుడు వస్తాడు అనేది తెలియదు. సో తారక్ ఫారిన్ నుంచి రావాలి, పూజా కార్యక్రమాలు పూర్తి చెయ్యాలి, కొరటాల శివ ప్రీప్రొడక్షన్స్ పనులు కంప్లీట్ చెయ్యాలి అప్పుడు ఫిబ్రవరి నుంచి ఎన్టీఆర్ 30 షూటింగ్ జరుగుతుంది. జనవరిలో పూజా కార్యక్రమాలు పూర్తి చేసి ఫిబ్రవరిలో షూటింగ్ కి వెళ్తారా లేక పూజా కార్యక్రమాలని కూడా ఫిబ్రవరికి షిఫ్ట్ చేసి, ఈ కార్యక్రమం అయిపోగానే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికైతే ఎన్టీఆర్ 30 అనే పేరుతో పండగ శుభాకాంక్షలు చెప్తుంటే నందమూరి అభిమానులు అప్సెట్ అవుతున్నారు.

Read Also: NTR: ‘బ్లాక్ పాంథర్’గా ఎన్టీఆర్? మార్వెల్ నుంచి ఆఫర్ వచ్చిందా?